mh ad
మంగళవారం, 23 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తమిళనాడు సిఎం విజయ్‌ పుట్టినరోజు : రాహుల్‌, స్టాలిన్‌‌లు శుభాకాంక్షలు

1 రోజు క్రితం

tamilnadu cm vijya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 12:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : సినీ స్టార్‌, తమిళనాడులో ఇటీవ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చర్రిత సృష్టించిన ముఖ్యమంత్రి విజయ్‌ ‌నేడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని మోడీ, రాహుల్‌, స్టాలిన్‌‌లతో పాటు పలువరు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ‘తమిళనాడు ముఖ్యమంత్రి తిరు సి. జోసెఫ్ విజయ్ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయుష్షుతో జీవించాలని ప్రార్థిస్తున్నాను’ అని మోడీ సామాజిక మాధ్యమం ఎక్స్‌ ‌పోస్టులో పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్‌ ‌నేత, లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌‌గాంధీ ‘జోసెఫ్ విజయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను మీకు మంచి ఆరోగ్యం, మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. తమిళ ప్రజల హక్కులు, గౌరవం, ఆకాంక్షలను పరిరక్షించడంలో, రాష్ట్ర పురోగతి కోసం కలిసి పని చేయడంలో నేను మీకు అండగా ఉంటాను’ అని ఎక్స్‌ ‌పోస్టులో పేర్కొన్నారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎం.కె స్టాలిన్‌ విజయ్‌‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయ్‌ ఆయురోరాగ్యాలతో ఉండాలని ప్రార్ధిస్తున్నట్లు స్టాలిన్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్