mh ad
మంగళవారం, 23 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎనిమిది మంది నేతల్ని బహిష్కరించిన టిఎంసి

2 గంటల క్రితం

Trinamool Congress
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 04:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కోల్‌‌కతా : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఎనిమిది మంది నేతలపై తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌వేటువేసింది. మంగళవారం జావేద్ అహ్మద్ ఖాన్, ఫిర్హాద్ హకీమ్, అరూప్ రాయ్, రతిన్ ఘోష్, బిప్లబ్ మిత్ర, సబీనా యాస్మిన్, అరూప్ బిస్వాస్, స్నేహసిస్ చక్రవర్తిలు ఈ ఎనిమిది మంది నేతల్ని టిఎంసి బహిష్కరించింది. వీరందరికీ అఖిలభారత తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ (ఎఐటిసి) షోకాజ్‌ ‌నోటీసు జారీ చేసింది. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారన్న ఆరోపణతో వీరికి షోకాజ్‌ ‌నోటీసు జారీ చేసింది.

కాగా, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టిఎంసిలో చీలిక వచ్చింది. పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం సోమవారం నాడు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ కమిటీకి కొత్త నాయకత్వ నిర్మాణాన్ని ప్రకటించింది. ఈ కమిటీకి తిరుగుబాటు ఎమ్మెల్యే అరూప్‌ ‌రాయ్‌‌ని ఛైర్‌‌పర్సన్‌గా నియమించింది. ఈ పరిణామం తర్వాతే మంగళవారం టిఎంసి ఈ ఎనిమిది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్