mh ad
మంగళవారం, 23 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కేంద్ర మంత్రి జార్జ్ కురియ‌న్ రాజీనామా

2 గంటల క్రితం

George Kurian
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 06:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: కేంద్ర మైనార్టీ వ్య‌వ‌హారాలు, మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖల సహాయ మంత్రి జార్జ్ కురియ‌న్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం జూన్‌ 21వ తేదీతో ముగిసిపోయింది. మళ్లీ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు బిజెపి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కురియ‌న్ అంద‌జేసిన రాజీనామాను రాష్ట్ర‌ప‌తి ముర్ము ఆమోదించిన‌ట్లు మంగ‌ళ‌వారం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ పేర్కొన్న‌ది. కాగా, కేంద్ర మంత్రి మండ‌లిలో ఉన్న క్రైస్త‌వ వ‌ర్గానికి చెందిన ఏకైక మంత్రి జార్జ్ కురియ‌న్ మాత్ర‌మే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్