mh ad
మంగళవారం, 23 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

"స్టూడెంట్" మూవీ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

1 గంట క్రితం

student poster
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 06:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా, విజేత పరీక్ హీరోయిన్‌గా నటిస్తున్న సరికొత్త చిత్రం "స్టూడెంట్". జోవికా సినిమాస్, చెరిష్ మీడియా వర్క్స్ బ్యానర్లపై బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలు తత్వమసి దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లం సంగీత, బెల్లం బయ్యారెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో మేఘాంశ్ శ్రీహరి ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తుండగా, పవర్ స్టార్ సినిమాకు బ్యానర్లు కట్టడం, జామెట్రీ బాక్స్‌లోని డివైడర్‌ను ఫైట్స్ కోసం ఉపయోగించడం, వెలుగుతున్న సిగరెట్ మరియు అందమైన లవ్ లెటర్స్ వంటి స్టూడెంట్ లైఫ్ ఎలిమెంట్స్‌ను ఆసక్తికరంగా చూపించారు. "ధైర్యం ఉన్నవాడే తన వెంట అందరూ నడిచేలా చేసుకుంటాడు" అనే కొటేషన్ హీరో డేరింగ్ క్యారెక్టర్‌ను ప్రతిబింబిస్తుండగా, "ఈ భాను గాడు అంతా చూసుకుంటాడు, నువ్వు లవ్ చేయి, తన్మయ్ లవ్స్ భాను" అనే డైలాగులు ఈ యాక్షన్ డ్రామాలో ఒక పవర్‌ఫుల్ లవ్ స్టోరీ కూడా ఉందని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా, మేఘాంశ్ శ్రీహరి కెరీర్‌లో ఇది ల్యాండ్ మార్క్ మూవీగా నిలుస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ను త్వరలోనే వెల్లడించనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్