శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫారమ్‌ 8పై నిర్ణయం తీసుకోవాల్సిందే !

1 రోజు క్రితం

sir
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 07:54 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- విచారణ లేకుండా పేరు తొలగించలేరు

- బాంబే హైకోర్టు గోవా బెంచ్‌‌ రూలింగ్‌

పనాజి : ఎస్‌ఐఆర్‌ ‌సమయంలో ఫారమ్‌ 8పై నిర్ణయం తీసుకోవాల్సిందేనని బాంబే హైకోర్టు గోవా బెంచ్‌ ‌స్పష్టం చేసింది. విచారణ జరపకుండా ఓటర్ల జాబితా నుండి పేరును తొలగించడమన్నది పౌరుడి ఓటు హక్కును నిరాకరించినట్లే కాగలదని పేర్కొంది. ఎస్‌ఐఆర్‌ ‌సందర్భంగా ఫారమ్‌-8 దరఖాస్తుపై ఎలక్టోరల్‌ ‌రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ ‌(ఇఆర్‌ఒ) నిర్ణయం తీసుకోవాలంటూ సాల్గంకర్‌ ‌కుటుంబ సభ్యులు ఆరుగురు పిటిషన్‌ ‌దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన బెంచ్‌ ‌పై తీర్పు వెలువరించింది. ఆ ఆరుగురి పేర్లను తిరిగి జాబితాలో పునరుద్ధరించాలని ఎన్నికల కమిషన్‌‌ను బెంచ్‌ ఆదేశించింది. వారి ఫారమ్‌-8 దరఖాస్తుల తిరస్కృతిని కొట్టివేయాలని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌ ‌వాల్మికీ మెనెంజెస్‌, జస్టిస్‌ అమిత్‌ ‌జమ్‌‌సందేకర్‌‌లతో కూడిన బెంచ్‌ ఈ మేరకు తీర్పునిచ్చింది.

1995 నుండి శాంతాక్రజ్‌ ‌నియోజకవర్గ పరిధిలో వున్న ఈ ఆరుగురు పిటిషనర్లు అదే నియోజకవర్గ పరిధిలోనే వేరే చోటకు మారారు. ఫారమ్‌-8ని అందచేసి, వెరిఫికేషన్‌ ‌పూర్తి చేసినా కూడా వారి పేర్లను తొలగించారు. వారికి ముందస్తుగా ఎలాంటి నోటీసు ఇవ్వలేదు, లేదా విచారణ జరగలేదు. అలాచేయడం వారి ఓటు హక్కును నిరాకరించడమే కాగలదని బెంచ్‌ ‌స్పష్టం చేసింది.

​ ఓటర్ల జాబితా సవరణ జరుగుతున్న సమయంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్‌ 22, అలాగే ఓటర్ల నిబంధనల నమోదు, 1960లోని 13వ నిబంధన ఎస్‌ఐఆర్‌ ‌సమయంలో అమలవడం కొనసాగాలని తీర్పు పేర్కొంది. కేవలం సవరణ జరుగుతుందనే కారణంతో ఇఆర్‌ఓ తిరస్కరించకుండా ఫారమ్‌ 8 దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఓటర్ల జాబితా సవరణ జరుగుతున్న సమయంలో ఫారమ్‌ 8ను ఇఆర్‌ఓ తిరస్కరించవచ్చనే ఇసి వాదనను బెంచ్‌ ‌తోసిపుచ్చింది. నియోజకవర్గ పరిధిలో నివాస మార్పులకు ఫారమ్‌-8ను ఆమోదించాలని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితలో తొలిసారి పేర్లు చేర్చుకునేందుకు ఫారమ్‌-6‌ ఉపయోగించాలని తెలిపింది. ఫారమ్‌-6‌ను దాఖలుచేయాలని ప్రస్తుత ఓటర్లను ఆదేశించడం వారిని తప్పుడు డిక్లరేషన్‌ ఇచ్చేలా ఒత్తిడి చేయడమే కాగలదని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్