సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్‌ఐఆర్‌‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం

16 నిమిషాల క్రితం

ఎస్‌ఐఆర్‌‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం
 - ఎస్‌‌కెఎం చేరికపై ప్రకాశ్‌‌రాజ్‌ హర్షం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 11:53 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎస్‌‌కెఎం చేరికపై ప్రకాశ్‌‌రాజ్‌ హర్షం

బెంగళూరు : సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌‌కెఎం) చేరికతో ఎస్‌ఐఆర్‌ అక్రమాలపై జరుగుతున్న ఆందోళనలు ఇక నుంచి దేశవ్యాప్త ఉద్యమంగా మారనుందని ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్ తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం భిన్నాభిప్రాయాలను అణచివేయడం కొనసాగిస్తే, ఓటర్లు ఆ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని ఆయన పేర్కొన్నారు. సోమవారం నాడు బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ ప్రకాష్‌ ‌రాజ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఢిల్లీలో సుమారు 200 సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో తాను పాల్గొన్నానని, అక్కడ ఎస్‌‌కెఎం ఈ ఆందోళనల్లో చేరాలని నిర్ణయాన్ని ప్రకటించిందని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఎస్‌ఐఆర్‌‌ వ్యతిరేక ఆందోళనలకు మద్దతు ఇస్తూ ఎస్‌‌కెఎం తీసుకున్న నిర్ణయంపై ప్రకాష్‌ ‌రాజ్‌ హర్షం ‌వ్యక్తం చేశారు. ‘‘పిల్లలపై జరుగుతున్న దాడులను, నిరసనలను ఎస్‌‌కెఎం గమనించింది’’ అని తెలిపారు. కేంద్రంలోని ​నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన చారిత్రాత్మక పోరాటాన్ని ఈ సందర్భంగా ప్రకాష్‌ ‌రాజ్‌ ‌గుర్తు చేశారు. అలాగే, ఈ నెల 23న జరిగే నిరసనలో పాల్గొనాలని రైతు సంఘాలకు ఎస్‌‌కెఎం పిలుపునిచ్చిందని ప్రకాష్‌ ‌రాజ్‌ ‌తెలిపారు. ‘‘ఫిరంగులు, బుల్డోజర్లు, అడ్డంకులు ఎదురైనప్పటికీ వారు తమ పోరాటంలో విజయం సాధించారు. ఇప్పుడు వారు మౌనంగా ఉండలేరు. అందుకే, ‘మేము విద్యార్థుల పక్షాన ఉన్నాం’ అని వారు ప్రకటించారు.

ఇది కేవలం విద్యార్థుల సమస్య మాత్రమే కాదు, ఇది దేశం కోసం జరుగుతున్న పోరాటం’’ అని ఆయన అన్నారు. ఎస్‌‌కెఎం చేరికతో ఎస్‌ఐఆర్‌ ఆందోళనలు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసన కంటే భారీగా మారుతుందని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. అయితే ఈ ఆందోళనలు పెరగడానికి ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ఈ ఆందోళనల్లో రైతులు, సైనికులు, కార్మిక సంఘాలు, దళిత సంస్థల భాగస్వామ్యం ఓటు హక్కును కాపాడుకునేందుకు దేశం మొత్తం ఏకమవుతోందనే స్పష్టమైన సందేశాన్ని అధికారంలో ఉన్న వారికి పంపుతుందన్నారు. ‘‘ఈ దేశంలో మనకు రాజ్యాంగం ఉంది, ఓటు హక్కు ఉంది, అలాగే ఎలా పోరాడాలో మహాత్మా గాంధీ మనకు నేర్పారు. ఇది శాంతియుతమైన నిరసనగా సాగుతుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మన మాట వినకుండా, చర్చలకు సిద్ధం కాకపోతే, ఓట్ల ద్వారా వారిని గద్దె దించుతాం’’ అని ఆయన అన్నారు. త్వరలో జరిగే ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికలతోనే ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ప్రకాష్‌ రాజ్ తెలిపారు. ‌తరువాత జరిగే 2029 లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి తొలగిస్తారన్నారు. ‘‘మీరు సైన్యాన్ని, బలప్రయోగాన్ని ఉపయోగిస్తూ భిన్నాభిప్రాయాలను అణచివేస్తుంటే, ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేకపోతే, ప్రజలే మిమ్మల్ని గద్దె దించుతారు. అదే పాలన మార్పు అవుతుంది’’ అని ప్రకాష్‌ ‌రాజ్‌ ‌హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్