అమరావతి : సిపిఎస్ ఉద్యోగులకు ఎపి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వెటరన్, ఫ్యామిలీ సిపిఎస్ కంట్రిబ్యూషన్‌పై స్పష్టత ఇచ్చింది. ఉద్యోగుల గ్రాట్యుటీ మేరకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించింది. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది. దీంతో రాష్ట్రంలోని 11 వేల మంది సిపిఎస్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఓఎం నంబర్ 57 అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై సచివాలయ సిపిఎస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపింది.
సిపిఎస్ ఉద్యోగులకు ఎపి సర్కార్ గుడ్‌న్యూస్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 23, 2026, 04:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)