ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గ్వాలియర్‌‌లో దారుణం

1 గంట క్రితం

traus
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 11:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఆలయ సందర్శకులపైకి దూసుకెళ్లిన ట్రక్కు

- 14 మంది మృతి

- 42 మందికి గాయాలు

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా స్థానిక అమ్మవారి ఆలయానికి వెళ్లిన సందర్శకులపైకి ఒక ట్రక్కు దూసుకెళ్లడంతో 14 మంది చనిపోయారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో 42 మంది గాయపడ్డారు. ఈ దారుణ ఘటన గ్వాలియర్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలోని శీతలా మాతా మందిరం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్నది. ఈ సంఘటన జరిగిన వెంటనే సంఘటనా స్థలం నుంచి డ్రైవర్‌ ‌పరారయ్యాడు. గాయపడిన వారి గ్వాలియర్‌లోని వివిధ ఆసుపత్రుల్లో చేర్చారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఎస్‌‌పి ధర్మ వీర్ సింగ్ మీడియాకు తెలిపారు. డ్రైవర్‌ను, ట్రక్కు యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ​కాగా ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని, క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించడంలో అధికారులు జ్యాపం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నాయకులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బిజెపి డబుల్‌ ఇంజిన్‌ ‌ప్రభుత్వాలు ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో అధికార యంత్రాంగ నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలైపోతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శరన్నవరాత్రి వేడుకులకు వచ్చివారికి తగిన భద్రత ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని బాధితులు వాపోతున్నారు. ఈ నెల 17న శనివారం సాయంత్రం పశ్చిమ బెంగాల్‌‌లోని కొల్‌‌కతాలో దుర్గాదేవీ పూజా మండపం వద్ద తొక్కిసలాట జరిగి 19 మంది చనిపోగా.. మరుసటి రోజైన ఆదివారమే బిజెపి పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌‌లో భద్రతా వైఫల్యం కారణంగా 14 మంది చనిపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్