శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు బిజెపి కుయుక్తులు

9 గంటల క్రితం

ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు బిజెపి కుయుక్తులు
- ఎంఎన్‌ఎస్‌‌ చీఫ్‌ రాజ్‌‌ థాకరే విమర్శలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 08:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎంఎన్‌ఎస్‌‌ చీఫ్‌ రాజ్‌‌ థాకరే విమర్శలు

ముంబయి: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరాఠీ, ఉత్తర భారత కమ్యూనిటీల మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లేలా చేయడానికి ఛాత్‌ ‌పూజ వివాదాన్ని వాడుకుంటున్నారంటూ ఎంఎన్‌ఎస్‌‌ చీఫ్‌ ‌రాజ్‌ ‌థాకరే శుక్రవారం బిజెపిని విమర్శించారు. ముంబయి రైల్వే స్టేషన్లలో భోజ్‌‌పురి గీతాలు వినిపించేందుకు ప్రయత్నాలు జరగడాన్ని ఆయన విమర్శించారు. సాంస్కృతికపరమైన విభేదాలు సృష్టించేందుకే ఉద్దేశ్యపూర్వకంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

తన పని తీరుపై ఆధారపడడానికి బదులుగా బిజెపి, ఎన్నికల్లో గెలుపొందేందుకు మత, ప్రాంతీయ ఘర్షణలను ఉపయోగించుకుంటోందని థాకరే విమర్శించారు. అటువంటి కవ్వింపు చర్యల ఎరలో పడవద్దని ఆయన మరాఠీ ప్రజలను కోరారు. వారు ఎంచుకున్న కదనరంగంలో మనం పోరాడాల్సిన అవసరం లేదు. ఇది మహారాష్ట్ర మార్గం కాదు. ఛత్రపతి మహారాజా గెరిల్లా యుద్ద ఎత్తుగడలను వారు మరిచిపోయి వుండవచ్చు, కానీ మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు, ఎలా ప్రతిస్పందించాలో మనం నిర్ణయిద్దామని రాజ్‌ ‌థాకరే పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌‌లో పోస్టు పెట్టారు. సహ్యాద్రి పర్వత శ్రేణితో సహా మహారాష్ట్ర వనరులను దోపిడీ చేయడానికి ఉద్దేశించిన పారిశ్రామిక విధానాలకు కేంద్రం మద్దతిస్తోందని అన్నారు. బిజెపి, అది పెంచి పోషిస్తున్న విషపూరితమైన సోషల్‌ ‌మీడియా వ్యవస్థ రెండూ కలిసి ఈ వివాదాలను, ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నాయన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్