mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రిటబత్ర బెనర్జీ నియామకంపై మధ్యంతర ఉత్తర్వుకు హైకోర్టు నో

19 గంటల క్రితం

Calcutta High Court refuses interim order
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 18, 2026, 03:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం


కోల్ కతా : పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేతగా (ఎల్ ఒ పి) రిటబత్ర బెనర్జీ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా నియామకంపై మధ్యంతర ఉత్తర్వు జారీ చేసేందుకు కోల్ కతా హైకోర్టు గురువారం నిరాకరించింది. శోభన్‌దేబ్ చటోపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ కృష్ణారావు, ప్రతిపక్ష నేతగా రిటబ్రత బెనర్జీ నియామకంపై మధ్యంతర స్టే విధించేందుకు నిరాకరించారు. తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు అవసరమైన బలమైన కారణం పిటిషన్ లో వెల్లడించలేదని పేర్కొన్నారు. అయితే, ప్రతిపక్ష నేతను నియమించే విషయంలో స్పీకర్ తన అధికార పరిధికి లోబడి వ్యవహరించారా లేదా అనే విస్తృత అంశాన్ని పరిశీలించేందుకు, సభ్యులంతా మూడు వారాల్లోగా అఫిడవిట్లను సమర్పించాలని ఆదేశించారు. తదుపరి విచారణను జులై 28కి వాయిదా వేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఎంపిక చేసిన శోభన్‌దేబ్ చటోపాధ్యాయకు బదులుగా, ఆ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యే రిటబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్