ఆదివారం, 11 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎమర్జెన్సీలో కూడా ఈవిధంగా ప్రవర్తించలేదు : సౌరవ్‌దాస్‌

12 గంటల క్రితం

CJP leaders
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026, 03:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఎమర్జెన్సీలో కూడా ఈవిధంగా ప్రవర్తించలేదని, శాంతియుతంగా నిరసన చేస్తున్న యువతను అరెస్టు చేశారని సిజెపి నేత సౌరవ్‌దాస్‌ పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన అనంతరం సిజెపి నేతలు మీడియాతో మాట్లాడారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్‌ కుమార్‌ను కాపాడేందుకే కేంద్ర ప్రభుత్వం నిరసనకారులపై అణచివేతకు పాల్పడుతోందని అన్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి సిఇసి వద్ద ఏదైనా కీలక సమాచారం ఉందా, అందుకే ప్రభుత్వం ఆయనను కాపాడుతోందా అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇలా ప్రవర్తించలేదని అన్నారు. ఢిల్లీ పోలీసులు తమకు నిర్బంధ నోటీసు ఇవ్వకుండా, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని, న్యాయవాదిని సంప్రదించేందుకు కూడా అనుమతించలేదని ఆయన పేర్కొన్నారు. జెన్‌జీ ఉద్యమాన్ని కవర్ చేస్తున్న స్వతంత్ర జర్నలిస్టులపై వేధింపులు జరుగుతున్నాయని అన్నారు. నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు బంగ్లా సాహిబ్ గురుద్వారాలోకి బలవంతంగా ప్రవేశించారని అన్నారు. యువత శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. జ్ఞానేష్‌ కుమార్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై దురుసుగా ప్రవర్తించారని, వేలాది మంది యువతపై దాడులు చేశారని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో కూడా రైళ్లు నిలిపివేయలేదని, ఆందోళనకారులపై కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. గతంలో ఎమర్జెన్సీ గురించి మాత్రమే విన్నామని, కానీ ఇప్పుడు మోడీ పాలనలో ప్రత్యక్షంగా చూస్తున్నామని అన్నారు. శాంతియుతంగా నిరసన చేసే హక్కు పౌరులకు లేదా అని సౌరవ్‌దాస్‌ మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్