గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సౌరవ్‌దాస్‌, అశుతోష్‌ రాంకాలకు ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ నోటీసులు

30 నిమిషాల క్రితం

CJP leader
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 12:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : తీహార్‌ జైలు నుండి విడుదలైన మరుసటి రోజే కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) నేతలు సౌరవ్‌దాస్‌, అశుతోష్‌ రాంకాలకు ఢిల్లీ పోలీసు క్రైమ్‌ బ్రాంచ్‌ నోటీసులు జారీ చేసింది. వారిపై నమోదైన రెండు కేసుల విచారణ నిమిత్తం గురువారం మధ్యాహ్నం రాజౌరీ గార్డెన్‌ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వీరితో పాటు అజింక్య షిండేకు కూడా సమన్లు జారీ అయ్యాయి.

అక్టోబర్‌ 13న బారికేడ్లతో మూసి ఉంచిన జంతర్‌మంతర్‌ గేట్లను ఎక్కి అక్రమంగా లోపలికి ప్రవేశించారన్న ఆరోపణలపై దాస్, రాంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్‌ 14న వారిని ఐదురోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అక్టోబర్‌ 19న మరో రెండు రోజులు పొడిగించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటూ వారి జ్యుడిషియల్ కస్టడీని మరో మూడు రోజులు పొడిగించాలని ఢిల్లీ పోలీసులు కోరారు. అయితే బుధవారం ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ (ఎస్‌ఇఎం) విచారణను పర్యవేక్షిస్తున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రితు రాజ్, వారి పూచీకత్తులను అంగీకరించి, వారిని విడుదల చేయాలని ఆదేశించారు. కేసుల సున్నిత స్వభావం, నిష్పక్షపాత విచారణను పేర్కొంటూ సిజెపి నేతలపై ఉన్న రెండు కేసులను ఢిల్లీ పోలీసులు క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు ఈ సమన్లు జారీ చేయడం గమనార్హం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్