శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముంబయిలో బొద్దింకల ఉప్పెన

1 గంట క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 01:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- గద్దె దిగకపోతే దేశవ్యాప్తంగా ‘జంతర్‌మంతర్‌ 2.0’ : అభిజిత్‌ దీప్కే హెచ్చరిక

- దిగ్గజ నటులు నషీరుద్దీన్‌, షబానా అజ్మీ, తుషార్‌ గాంధీ తదితర ప్రముఖుల మద్దతు

ముంబయి :దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబయి మహానగరం లక్ష‍లాది మంది యువతతో పోటెత్తారు. యువతీ, యువకులు బొద్దికల దండు లా ఉప్పెనలా కదిలివచ్చారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ తక్ష‍ణమే రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) రద్దు చేయాలని, అలాగే ఎస్‌ఐఆర్‌కు ముందునాటి ఓటర్ల జాబితాతోనే రాబోయే ఎన్నికలు నిర్వహించాన్న డిమాండ్లతో నినాదాలు హోరెత్తాయి. కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) ఆధ్వర్యంలో శుక్రవారం ముంబయిలోని శివాజీ పార్కులో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యువతీ యువకులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీసులు అను మతి నిరాకరించినప్పటికీ సిజెపి వెనకడుగు వేయలేదు. నిరసన జరిగే ప్రాంతానికి దగ్గర్లోని దాదర్‌ రైల్వేస్టేషన్‌, సెంట్రల్‌ ముంబయి ప్రాంతాల్లో పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది మోహరించిన ప్పటికీ.. పెద్దఎత్తున నిరసనకారులు శివాజీ పార్క్‌కు చేరుకున్నారు. ‘జ్ఞానేశ్‌ బ్రో, జస్ట్‌ రిజైన్‌’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వ్యవస్థా పకుడు అభిజిత్‌ దీప్కే మాట్లా డుతూ "ఒకే దేశం- ఒకే ఎన్నిక అనేది కేవలం ఒక నినాదం. నిజానికి బిజెపికాల్సింది ఒకే దేశం ఒకే పార్టీ" అని విమర్శిం చారు. "ఓట్ల తొలగింపుతో మోడీ హవా ఉధృతంగా ఉన్న సమయంలో కూడా గెలవని రాష్ట్రాలను బిజెపి గెలుచుకుంది" అని తెలిపారు. నీట్‌కు వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టిన రెండు నెలల వ్యవధిలోనే మరోసారి ఆందోళనకు దిగాల్సిన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయన్నారు. ధైర్యం ఉంటే లక్ష‍లాదిగా తరలివచ్చిన వీరందరినీ జైల్లో పెట్టండి అంటూ మహారాష్ట్రలోని బిజెపి ప్రభుత్వానికి ఆయన సవాలు విసిరారు. ఎస్‌ఐఆర్‌‌లో అక్రమాలకు బాధ్యత మహిస్తూ జ్ఞానేష్ కుమార్ పదవి నుంచి వైదొలగకపోతే దేశవ్యాప్తంగా “జంతర్ మంతర్ 2.0” చేపడతామని హెచ్చరించారు. బిజెపితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ ఆందోళనతో ‘గాంధీ జయంతి’ మోడీకి ఎప్పుడూ గుర్తుండిపోతుందని ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమానికి శివసేన (యుబిటి), మహారాష్ట్ర నవనిర్మాణ సేన మద్దతు ప్రకటించాయి. శాంతిభద్రతల కారణంతో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.సెంట్రల్ ముంబై ప్రాంతంలో పోలీసులు, భద్రతా దళాలను భారీ సంఖ్యలో మోహరించినప్పటికీ, సమీపంలోని దాదర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రవేశ మార్గాలను బారికేడ్లతో మూసివేసినప్పటికీ, చారిత్రాత్మక రాజకీయ ర్యాలీలకు ప్రసిద్ధి చెందిన ఆ మైదానానికి నిరసనకారులు తరలివచ్చారు. ఒక వైద్య బృందం ఈ ఆందోళన వద్దకు స్వచ్ఛంధంగా చేరుకుని తన సేవలను అందించింది. ఈ ఆందోళనకు వివిధ సంఘాలతో పాటు పలువురు ప్రముఖులు సంఘీభావం తెలిపారు. దిగ్గజ నటుడు నషీరుద్దీన్‌ షా, సీనియర్‌ నటులు షబానా అజ్మీ, గాయకుడు విశాల్‌ దద్లానీ, గాంధీ మునిమనువడు, సామాజిక కార్యకర్త తుషార్‌ గాంధీ సహా పలువురు ప్రముఖులు ఈ ఆందోళనలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

షబానా అజ్మీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, ఓటు హక్కులు మరియు ఓటర్ల జాబితాల అవకతవకలపై ఉన్న ఆందోళనల కారణంగానే ఈ కార్యక్రమం జరిగిందని తెలపారు. ఓటర్ల జాబితాల నుంచి వేలాది పేర్లను తొలగించారని, "ప్రజల శక్తి"ని ఆపడం అసాధ్యమని ఆమె అభివర్ణించారు. ఈ ఆందోళన తరువాత చర్యలు తీసుకుంటారా లేదా అనే ఆంశం తరువాత నిరననకారులు తమ పోరాటాన్ని కొనసాగిస్తారని అజ్మీ తెలిపారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు హర్షవర్ధన్ సప్కల్ కూడా ఈ నిరసనలకు మద్దతు తెలిపారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థ రాజీపడిందని, అవకతవకలకు బాధ్యులైన వారు పదవి నుండి వైదొలగే వరకు ఈ ఆందోళన కొనసాగాలని అన్నారు. ​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్