బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిజెపి నేతల కస్టడీ పొడిగింపుపై విచారణకు అనుమతించిన ఢిల్లీ హైకోర్టు

14 నిమిషాల క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 01:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా తమ జ్యుడీషియల్ కస్టడీని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ (ఎస్‌ఇఎం) పొడిగించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు బుధవారం అంగీకరించింది. "శాంతి పరిరక్షణ" కోసం ఎస్‌ఇఎం ముందు బాండ్ సమర్పించాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు అక్టోబర్ 17న జారీ చేసిన నోటీసుకు వ్యతిరేకంగా, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఎఐఎస్‌ఎ) అధ్యక్షురాలు నేహా బోరా దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్‌ను కూడా జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ విచారించనున్నారు.


మరోవైపు, సిజెపి నేతలు సౌరవ్‌దాస్‌, అశుతోష్‌ రాంకేలపై నమోదైన మరో కేసును ఢిల్లీ పోలీసులు క్రైమ్‌ బ్రాంచ్‌కు అప్పగించినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. సిజెపి నేతలపై నమోదైన రెండు కేసులను ప్రస్తుతం క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నాయి. సౌరవ్, రాంకాలు జంతర్‌మంతర్‌లోకి ప్రవేశించినట్లు ఆరోపణలు ఉన్న మరో కేసును, సోమవారమే క్రైమ్‌బ్రాంచ్‌కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 13న సౌరవ్‌దాస్‌, రాంకా, అజింక్య షిండే సహా మరో 11 మంది ప్రైవేట్‌ ప్రాంతం నుండి చొరబడి జంతర్‌మంతర్‌కు చేరుకున్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. ఈ ప్రాంతాన్ని నిరసన ప్రదేశం జాబితా నుండి ఢీ నోటిఫై చేసినట్లు తెలిపారు. 14మందిని అదుపులోకి తీసుకుని, వారిపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు వెల్లడించారు. అక్టోబర్‌ 14న సౌరవ్‌దాస్‌, రాంకాలకు ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. సోమవారం జ్యుడీషియల్‌ కస్టడీని మరో రెండు రోజులు పొడిగించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్