శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జంతర్ మంతర్ మూసివేత‌

12 అక్టోబర్, 2026

jantar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 08:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మూడు కొత్త వేదికలు ప్రకటించిన పోలీస్‌ కమిషనర్‌

​ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత ప్రాంతం జంతర్ మంతర్ వద్ద నిరసనలకు పోలీసులు బ్రేక్‌ ‌వేశారు. ఇప్పటివరకూ ఆందోళనలకు కేంద్రంగా ఉన్న ఆ ప్రాంతాన్ని నిరసన ప్రదర్శనలు తెలిపే వేదిక నుంచి తొలగిస్తూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జంతర్ మంతర్‌ను డీనోటిఫై చేస్తున్నామని, ఇకపై నిరసనలను అనుమతించబోమని కమిషనర్ పేర్కొన్నారు. రామ్‌లీలా గ్రౌండ్, బురారీ గ్రౌండ్, ఈస్ట్ ఢిల్లీలోని సిబిడి గ్రౌండ్ లలో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, బైఠాయింపులు వంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చునని పేర్కొన్నారు. ఇందుకోసం త్వరలోనే వేర్వేరుగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను విడుదల చేస్తామన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌) ప్రక్రియలో ఓటరు జాబితాల నుంచి కోట్లాదిమంది ఓటర్ల పేర్లను తొలగించారన్న ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా బ్లాక్‌, కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి), ఎస్‌ఎఫ్‌ఐ సహా విద్యార్థి, యువ‌జ‌న సంఘాలు జంతర్ మంతర్‌లో భారీఎత్తున నిరసనలు చేపడుతుండటంతో జాబితా నుంచి ఆ ప్రాంతాన్ని తొలగించారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ ప్రకటనపై ప్రతిపక్షాలు అభ్యతరం తెలిపాయి. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారని కేంద్రాన్ని విమర్శించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్