ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిర్లక్ష్యం, నిర్వహణాలోపాలే బలితీసుకున్నాయి...

1 గంట క్రితం

sad
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 01:37 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- కొల్‌కతా తొక్కిసలాట ఘటనపై పోలీసుల వెల్లడి

కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ రాజధాని కొల్‌కతాలోని చార్‌బగాన్‌ సర్వజనీన్‌ దుర్గా మండపం వద్ద శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనకు నిర్లక్ష్యం, నిర్వహణాలోపాలే ప్రధాన కారణమని పోలీసులు ఆదివారం ప్రకటించారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేవారు. మరోవైపు మృతుల సంఖ్య 19 కి చేరింది. ఇంకా 25 మంది క్ష‍తగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూజా నిర్వాహకుల నిర్లక్ష్యానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. భారీ వర్షం తర్వాత జన సమూహాన్ని నియంత్రించడంలో దుర్గా పూజ మండపం నిర్వాహకులు విఫలమయ్యారని, అలాగే తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం వంటివి సందర్శకులలో భయాందోళనలను రేకెత్తించాయని, అందువల్లే తొక్కిసలాట జరిగిందని ఆ అధికారి పేర్కొన్నారు. పూజా నిర్వాహకుల ఘోరమైన నిర్లక్ష్యానికి సంబంధించి తాము తగినన్ని ఆధారాలు సేకరించామని చెప్పారు. సిసిటివి కెమెరా ఫుటేజీని సేకరించి, స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేసి ఈ విషయాన్ని నిర్ధరించుకున్నామని వెల్లడించారు.


సిపిఎం పొలిట్‌‌బ్యూరో తీవ్ర దిగ్ర్భాంతి

న్యూఢిల్లీ : కొల్‌‌కతాలోని చార్‌బగన్ దుర్గామండపం వద్ద జరిగిన తొక్కిసలాటలో 19 మంది ప్రాణాలు కోల్పోవడంపై భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పొలిట్‌‌బ్యూరో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. బాధితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండే కొల్‌‌కతా వైద్య కళాశాల ఆసుపత్రికి కాకుండా ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించడాన్ని సిపిఎం ఆక్షేపించింది. ప్రయివేటు ఆసుపత్రికి ప్రచారకార్యకర్తగా బిజెపి ప్రభుత్వ వ్యవహరించడం సిగ్గు చేటు అని, ఇప్పుడు బాధితులకు ఎంతటి సానుభూతి ప్రకటించినా..లేదా పరిహారం అందించాని ఆ నష్టాన్ని భర్తీ చేయలేరని పేర్కొంది. దుర్గమ్మ మండపాల వద్ద సందర్శకుల భద్రతను పటిష్టం చేయడానికి కట్టుదిట్టుమైన ఏర్పాట్లు చేయకుండా..ఆ మండపాల పూజా కమిటీలను గుప్పిట్లో పెట్టుకోవడానికి రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం శ్రద్ధ చూపిందని విమర్శించింది. ఈ ఘటనకు కారణమైన దుండగలను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ ‌చేసింది. కాగా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా నగరంలో మండపాలకు సమీపంలో పుస్తకాల దుకాణాలు ఏర్పాటు చేయడం విక్రయించడం కొల్‌‌కతా సంస్కృతిలో సాంప్రదాయంగా వస్తోంది.

బిజెపి పాలకులు ఇప్పుడు ఆ పుస్తకాల దుకాణాలను కూడా కూల్చివేసి దుర్మార్గం చాటారు. ఈ చర్యలను కూడా సిపిఎం పొలిట్‌‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. సాధారణంగా సుదూర ప్రాంతాల నుండి మండపాల సందర్శనకు వచ్చే ప్రజల భద్రతకు ఏర్పాట్లు చేసి అక్కడే మోహరించాల్సిన పోలీసులు ఆ పని చేయకుండా ప్రగతిశీల పుస్తకాల దుకాణాలను అడ్డుకకోవడంలోనూ, కూల్చివేసే చర్యల్లోనూ నిమగ్నమవ్వడం దుర్మార్గమని తెలిపింది. అంతేకాదు పౌర సమాజాలు, విపత్తు నివారణ సహాయక బృందాలతో కలిసి ప్రజలకు సేవలందించాల్సిన పోలీసులు..పాలక పెద్దలకు, వివిఐపిలకు, వారి అనుచరుల సేవలో తరిస్తున్నారని విమర్శించింది. తొక్కిసలాట ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను బాధ్యులుగా చేయాలని, జవాబుదారీతనం నెలకొల్పడానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్‌ ‌చేసింది.

నిర్వాహక కమిటీలోకి చొరబడ్డ అధికారిక పెద్దలు

సాధారణంగా దుర్గా మండపాల వద్ద పూజా నిర్వాహకులు ప్రతి మండపాన్ని ప్రత్యేక కాన్సెప్టుతోనూ, థీమ్‌‌తో రూపొందిస్తారు. ఇందుకు సంబంధించిన వనరులను సమీకరించి..విజయవంతం చేయడానికి ఏడాది పొడవునా అదే పనుల్లో నిమగ్నమైవుంటారు. తొక్కిసలాట జరిగిన మండపం వద్ద కూడా ఇలాగే చేసేవారు..కానీ అధికార బిజెపి పెద్దలు ఈ పూజా కమిటీలోకి బలవంతంగా చొరబడ్డారు. ఈ ఏడాది జులై మధ్యలో ఈ మండపం మునుపటి నిర్వాహకులను కాదని..ప్రభుత్వ పెద్దలే పూజా కమిటీలో తమ వారిని నియమించుకున్నారు. అందువల్లే జన సమూహ నిర్వహణకు సరైన ప్రణాళిక లేకపోవడం, ప్రామాణిక పద్ధతులు కొరవడటం వంటివి ఇటువంటి విషాదకరమైన అవాంఛనీయ ఘటనలకు దారితీశాయని సిపిఎం పేర్కొంది. ప్రభుత్వం ఇప్పటికైనా తన తప్పిదాలను సరిచేసుకోవాలని హితవు పలికింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్