న్యూఢిల్లీ : అక్టోబర్ 10నాటి నిరసనల్లో నిర్బంధించిన ఆందోళనకారులపై తీసుకున్న చర్యలను ఢిల్లీ పోలీస్ కమిషనర్ సమర్థించుకున్నారు. గురువారం ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. నిఘా సమాచారం, క్షేత్రస్థాయి పరిస్థితులు, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా నిరోధించే లక్ష్యంతో అక్టోబర్ 10న నివారణ చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు. నిరసనకారులకు వేడి భోజనం అందించామని, జైళ్లలో బంధించకుండా, తాత్కాలిక కేంద్రాల్లో ఉంచామని అన్నారు. నిర్బంధించిన వారిని కేవలం రెండు నుండి ఆరుగంటల పాటు మాత్రమే నిర్బంధించారని తెలిపారు. మాజీ రాజకీయ నేతలకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ల చాంబర్లలో ఉంచామని, వారి గౌరవానికి భంగం కలగకుండా టీ, కాఫీ, భోజనం, ఇతర పానీయాలు అందించామని అన్నారు. కేవలం మొబైల్ ఇంటర్నెట్ను మాత్రమేనిలిపివేశామని, అది కూడా రైసినా హిల్ చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో మాత్రమేనని అన్నారు. న్యూఢిల్లీలో “శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూసేందుకు పోలీసులు ఈ “ముందస్తు చర్యలు” తీసుకున్నారని అన్నారు. అక్టోబర్ 10న జరిగిన పోలీసు చర్యలు, నిర్బంధాలను సవాలు చేస్తూ సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబి, పిటిషనర్ సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠిలు దాఖలు చేసిన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారించనున్న కొన్ని గంటల ముందు ఢిల్లీ పోలీస్ చీఫ్ ఈ అఫిడవిట్ను దాఖలు చేశారు. అక్టోబర్ 10న మొత్తం 303 మెట్రో స్టేషన్లలో కేవలం 45 స్టేషన్లను మాత్రమే మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ ఇచ్చిన ప్రత్కేక అఫిడవిట్లో పేర్కొంది.
నిరసనకారులపై తీసుకున్న చర్యలపై ఢిల్లీ పోలీస్ చీఫ్ అఫిడవిట్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 15, 2026, 11:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)