ఇండోర్ : ఐదు రోజుల మధ్యప్రదేశ్ పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఇండోర్ కు చేరుకున్నారు. ముర్ముకు దేవీ అహల్యాబాయి విమానాశ్రయంలో గవర్నర్ మంగు భాయ్ పటేల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. చిరుత పులులకు ప్రసిద్ధి పొందిన కునో నేషనల్ పార్క్ ను సందర్శిస్తారని అధికారులు తెలిపారు. జూన్ 21 అంతర్జాతీయ యోగాడే సందర్భంగా జబల్పూర్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇండోర్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 18, 2026, 10:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)