గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 12న రాజ్యసభ ఉప ఎన్నిక

20 నిమిషాల క్రితం

bypoll
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 01:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నవంబర్ 12న నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) గురువారం ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ రాజీనామాతో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఇసిఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 26న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి నవంబర్ 2, చివరి తేదీ కాగా, నవంబర్ 3, 2026న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి నవంబర్ 5 చివరి తేదీ. నవంబర్ 12న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్నికల ప్రక్రియ నవంబర్ 16 నాటికి పూర్తవుతుంది. బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఊదా రంగు ( స్కెచ్ పెన్నులను) మాత్రమే ఉపయోగించాలని ఇసిఐ ఆదేశించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్