- నలుగురికి గాయాలు
న్యూఢిల్లీ: పర్షియన్ గల్ఫ్‌లో ప్రయాణిస్తున్న లైబీరియా జెండా కలిగిన 'ఎం.టి. ఫుజైరా ఎనర్జీ' నౌకపై నవంబర్ 10న క్షిపణి దాడి జరిగింది. ఈ నౌకలో ఆరుగురు భారతీయ నావికులు సహా మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. వీరిలో ఒక భారతీయుడికి స్వల్ప గాయాలయ్యాయి. అతడిని తదుపరి వైద్య పరీక్షల కోసం సురక్షితంగా ఒడ్డుకు తరలించారు. మిగిలిన 20 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. వీరిలో ఐదుగురు భారతీయ నావికులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. నావికులందరి భద్రత, వైద్య సంరక్షణ, క్షేమం కోసం ప్రభుత్వం నౌక యాజమాన్య సంస్థతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించారు.







కామెంట్‌లు (0)