ఆదివారం, 27 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎల్‌‌పియులో విద్యార్ధుల ఆందోళనలు

6 గంటల క్రితం

ఎల్‌‌పియులో విద్యార్ధుల ఆందోళనలు
- జాతీయ రహదారి దిగ్బంధం
- అత్యాచారం వార్తలతో నిరసనలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 09:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- జాతీయ రహదారి దిగ్బంధం

- అత్యాచారం వార్తలతో నిరసనలు

చండీఘడ్‌ : పంజాబ్‌‌లోని లవ్‌‌లీ ప్రొఫెషనల్‌ ‌యూనివర్శిటీ (ఎల్‌‌పియు) విద్యార్థులు రోడ్డెక్కారు. యూనివర్శిటీ క్యాంపస్‌‌లో విద్యార్థినిపై అత్యాచారం చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శనివారం రాత్రి ఒక్కసారిగా విద్యార్ధులు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా యూనివర్శిటీ ప్రాగంణం ‌విధ్వంసం, హైవే దిగ్బంధనం వంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే, ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. అలాగే బాధితులు లేదా నిందితులు ఎవరి వివరాలు కూడా తెలియరాలేదన్నారు. ఈ ఆరోపణలన్నీ కేవలం కల్పితాలని యూనివర్శిటీ అధికారులు పేర్కొంటుండగా, పోలీసులు మాత్రం దర్యాప్తును ప్రారంభించారు. విద్యార్ధినిపై అత్యాచారం జరిగిందని వార్త వెలువడిన వెంటనే ఒక్కసారిగా విద్యార్ధులు ఆగ్రహంతో వర్శిటీ క్యాంపస్‌‌లోని కిటికీ అద్దాలు పగలగొట్టారు, పూల కుండీలను విసిరేశారు. కొన్ని వస్తువులను తగలబెట్టడం కూడా కనిపించింది. ఇందుకు సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అలాగే జలంథర్‌-‌ఫగ్వారా జాతీయ రహదారిని కూడా విద్యార్ధులు దిగ్బంధించారు. కాగా దీనిపై పోలీసు అధికారులు స్పందిస్తూ నిరసనల సమయాల్లో విద్యార్ధులు కనీసం బాధితురాలి వివరాలు కూడా ఇవ్వలేదని చెప్పారు. కాగా ఎల్‌‌పియు యాజమాన్యం మాత్రం ఇదంతా సంఘ వ్యతిరేక శక్తుల పనే అని విమర్శించింది. వర్శిటీలోని శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే పనులేనని యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ ‌డాక్టర్‌ ‌మోనికా గులాతి ఆదివారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసులు విద్యార్ధులను ఒప్పించి ఉదయానికల్లా దిగ్భంధనం ఎత్తివేస్తూ చర్యలు తీసుకున్నారు. అయినా విద్యార్ధులు మళ్ళీ హైవేను దిగ్బంధించడంతో పంజాబ్‌, హిమాచల్‌ ‌ప్రదేశ్‌, జమ్మూ కాశ్మీర్‌ ల్లోని కొన్ని ప్రాంతాలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు కలిగాయి. కపుర్తలా ఎస్‌ఎస్‌‌పి గౌరవ్‌ ‌తూరా మాట్లాడుతూ, విద్యార్ధుల స్టేట్‌‌మెంట్‌ నమోదు చేశామన్నారు. దర్యాప్తు చేపట్టామన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్