న్యూఢిల్లీ : నిరసన వేదిక జాబితా నుండి జంతర్‌మంతర్‌ను తొలగించడంపై సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేసింది. జంతర్‌మంతర్‌ను తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. నిరసనల కోసం ప్రత్యామ్నాయ వేదికలను గుర్తించాల్సిన అవసరంపై అక్టోబర్ 9న సుప్రీంకోర్టు ఆదేశాలతో తీసుకున్నది కాదని, గతంలో కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం, ఢిల్లీ పోలీసులు తెలిపారు. జంతర్‌మంతర్ తొలగింపును కోర్టు పరిశీలనల ఆధారంగా తీసుకున్నారా లేక ఆ ప్రదేశం యోగ్యతపై స్వతంత్ర అంచనా ఆధారంగా తీసుకున్నారా అనే విషయాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.
వాస్తవానికి, నిరసన ప్రదర్శనల కోసం ఢిల్లీలో దశాబ్దాలుగా ఉన్న ఏర్పాటును పునఃపరిశీలించాలని కోరుతూ సుప్రీంకోర్టు అక్టోబర్ 9న ఇచ్చిన ఉత్తర్వుల దృష్ట్యా, జంతర్ మంతర్‌ను నిర్దేశిత నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేసినట్లు ఢిల్లీ పోలీసులు బుధవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన ఒక రోజు తర్వాత ఎస్జి ఈ విషయాన్ని సమర్పించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ నిరసన తెలిపేందుకు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ దాఖలు చేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ, పోలీసుల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ, జస్టిస్ అమిత్ మహాజన్ నేతృత్వంలోని ధర్మాసనానికి, “అక్టోబర్ 9 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత తాము జంతర్ మంతర్‌ను నిరసన స్థలం జాబితా నుండి తొలగించామని తెలిపారు.








కామెంట్లు (0)