ఆదివారం, 27 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిఇసి రాజీనామా చేయాల్సిందే !

4 గంటల క్రితం

cpim
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 10:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సిపిఎం డిమాండ్‌

న్యూఢిల్లీ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌), ఎన్నికల కమిషన్‌ ‌వ్యవహార శైలి గురించి బయటకు వచ్చిన అంశాలతో తలెత్తిన తీవ్రమైన ప్రశ్నలకు

శనివారం ఇసి విడుదల చేసిన ప్రకటన ఎలాంటి సమాధానమివ్వలేదని సిపిఎం పేర్కొంది. ఈ మేరకు పొలిట్‌‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త ఓటర్లను ఎలా నమోదు చేస్తున్నారు, ఓటర్ల పేర్లను ఎలా తొలగిస్తున్నారు, ఎన్నికల డేటాబేస్‌‌కు యాక్సెస్‌‌ను ఎలా కేంద్రీకృతం చేశారు, ఫారమ్‌-6‌కు అక్రమంగా చేసిన మార్పులతో సహా ఎన్నికల విధానాలు ఎలా మార్పు చెందాయి వంటి పలు అంశాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పదే పదే తీవ్రంగా ఆందోళనలు వ్యక్తం చేసినట్లు ఇండియన్‌ ఎక్స్‌‌ప్రెస్‌ ‌తెలిపింది. దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ ‌ప్రక్రియను అమలు జరుపుతున్న వేళ ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజ సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. ఎన్నికల కమిషన్‌లో వెల్లడైన అంశాలతో ఈ ఆందోళనలు మరింత బలపడ్డాయి. అర్హులైన ఓటర్లను తప్పుడు పద్ధతుల్లో బహిష్కరించకుండా తగిన రక్షణలు తీసుకుంటూ చట్టప్రకారం పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారా లేదా అనేదే ఇక్కడ కీలకమైన అంశంగా వుంది.

కీలకమైన ఈ అంశాల్లో వేటినీ ఇసి ప్రకటన ప్రస్తావించ లేదు లేదా తిరస్కరించలేదు. పాలక వర్గం తరపున వ్యవహరించే ఒక వ్యక్తి లేదా ఒక గ్రూపు తీసుకునే అనాలోచిత, నిరంకుశ చర్యల కారణంగా పౌరులు ఎదుర్కొనే తీవ్రమైన ఇబ్బందులకు సంబంధించిన జవాబుదారీతనం గురించి కూడా ఇసి మాట్లాడలేదని పొలిట్‌‌బ్యూరో విమర్శించింది. ఈ నేపథ్యంలో, సిఇసి జ్ఞానేష్‌ ‌కుమార్‌‌ తక్షణమే రాజీనామా చేయాలనే ‌తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. ఆయన రాజీనామా చేయని పక్షంలో, తప్పుడు ప్రవర్తనకు గానూ ఆయనను అభిశంసించాలి. అలాగే ఎస్‌ఐఆర్‌ ‌ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని సిపిఎం డిమాండ్‌ ‌చేసింది.

జ్ఞానేష్‌ ‌కుమార్‌‌ను జవాబుదారీ చేయాలి. ఆయన రాజీనామా చేయాల్సిందే, ముఖ్యంగా కేరళంకు చెందిన సీనియర్‌ (‌రిటైర్డ్‌) ఐఎఎస్‌ అధికారి ఒకరు ఆయనపై చేసిన కొత్త ఆరోపణల నేపథ్యంలో ఆయన గద్దె దిగక తప్పదని పొలిట్‌‌బ్యూరో స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్