న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద జులై నెలలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించిన అన్ని కోణాలను విచారించడానికి సుప్రీం కోర్టు నియమించిన ఉన్నత స్థాయి విచారణా కమిటీ (హెచ్‌పిఇసి) ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. ఇందులో ఇరుపక్షాల బాధితులు తమ వివరాలు నమోదు చేయవచ్చునని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఎ) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. పెల్లెట్ గన్‌ల వినియోగం, వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని హింస, మహిళా ఆందోళనకారులపై వేధింపులు, ఇరు పక్షాల వైపు జరిగిన మితిమీరిన హింస, విధ్వంసానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎంహెచ్‌ఎ తెలిపింది. పోలీసు సిబ్బందితో సహా బాధితులకు సౌకర్యంగా వుండేందుకు ఈ పోర్టల్‌ను ఆరంభించినట్లు పేర్కొన్నారు. వివరాలకు http://hpec.nic.in సంప్రదించాలని సూచించింది. సుప్రీం కోర్టు ఆదేశాల్లో పేర్కొన్న అంశాలను ఈ కమిటీ విచారిస్తుంది. సాక్షులను కాపాడేందుకు, తమ వివరాలు రహస్యంగా వుంచాలని బాధితులు కోరితే అందుకు వీలుగా ఈ పోర్టల్ రూపొందించబడిందని ఎంహెచ్‌ఎ తన ప్రకటనలో పేర్కొంది. సుప్రీం జారీ చేసిన రెండు ఆదేశాల పరిధి కిందకు వచ్చే అంశాలపై ఎవరైనా సమాచారం లేదా సూచనలు ఇవ్వాలనుకుంటే వాటికి కూడా పోర్టల్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అలాగే వ్యక్తిగతంగా కూడా ఫిర్యాదులు, మెమోరాండాలు, ఇతర సంబంధిత సమాచారాన్ని పనిదినాల్లో మధ్యాహ్నం 2 నుండి 4గంటల మధ్య కమిటీ కార్యాలయంలో అందచేయవచ్చని తెలిపింది. కమిటీ అడ్రస్‌ను కూడా ఆ ప్రకటనలో వెల్లడించారు. సిజెపి నేతృత్వంలో సాగిన ఆందోళనల సందర్భంగా విద్యార్ధి నిరసనకారులపై పోలీసుల దాడులు, హింస వంటివి జరిగాయంటూ దాఖలైన పిటిషన్లను విచారించే సందర్భంలో ఈ కమిటీ ఏర్పాటుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో జస్టిస్ రెడ్డితో పాటూ పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ చీఫ్‌జస్టిస్ రవి శంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శైలేందర్ కౌర్, సిబిఐ మాజీ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, మేఘాలయ రిటైర్డ్ డిజిపి ఎల్.ఆర్.బిష్ణోయ్‌సభ్యులుగా వున్నారు.
జంతర్‌మంతర్ ‘బాధితుల’ కోసం పోర్టల్
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 17, 2026, 08:39 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)