సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెట్రోల్‌లో 31.2శాతం ఇథనాలే

2 గంటల క్రితం

పెట్రోల్‌లో 31.2శాతం ఇథనాలే
- దుమారం రేపిన కర్ణాటక ప్రభుత్వం ప్రకటన
- కేరళంలోనూ తనిఖీలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 01:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- దుమారం రేపిన కర్ణాట- దుమారం రేపిన కర్ణాటక ప్రభుత్వం ప్రకటన

- కేరళంలోనూ తనిఖీలుక ప్రభుత్వం ప్రకటన

- కేరళంలోనూ తనిఖీలుబెంగళూరు : ఇ-20 పెట్రోల్ నాణ్యతపై కర్ణాటక ప్రభుత్వానికి, కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు మధ్య తీవ్ర వివాదం రాజుకుంది. రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల్లో సేకరించిన నమూనాల్లో ఇథనాల్ 31.2శాతం వరకు ఉందని కర్ణాటక తెలిపింది. అయితే. ప్రమాణాలకు లోబడే ఉన్నాయని కేంద్రం, చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసి) తెలిపాయి. దీంతో ఇంధన నాణ్యత, వినియోగదారుల రక్షణ, దేశ ఇథనాల్‌‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ఏం జరిగింది?

బెంగళూరు, కోలార్, చిక్కబళ్లాపుర, బెంగళూరు రూరల్ సహా ఏడు జిల్లాల నుంచి 63 పెట్రోల్ నమూనాలు ప్రభుత్వం సేకరించింది. వీటిని ఎన్‌ఎబిఎల్ గుర్తింపు, ఐఎస్‌ఒ ధ్రువీకరణ ఉన్న ప్రయోగశాలల్లో పరీక్షించగా, ఇండియన్ ఆయిల్ (ఐఒసిఎల్) నమూనాల్లో 31.2 శాతం, హెచ్‌పిసిఎల్ నమూనాల్లో 30.5 శాతం వరకు ఇథనాల్ ఉన్నట్లు తేలింది. ఈ విషయాలను ​ కర్ణాటక రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, తూనికలు–కొలతల శాఖ మంత్రి రిజ్వాన్ అర్షద్ శుక్రవారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దాదాపు ఐదింట నాలుగు నమూనాల్లో 20 శాతానికి మించి ఇథనాల్ ఉందని ఆయన వివరించారు. దేశంలోని వాహనాల్లో సుమారు 99 శాతం ఇ20 పరిమితికి మించిన మిశ్రమం కోసం తయారైనవి కావని అర్షద్ అన్నారు. వినియోగదారులకు ఏటా సుమారు రూ.60వేల కోట్ల వాటిల్లుతోందని అంచనా వేశారు. వాహనాలు దెబ్బతిన్న వినియోగదారులకు పరిహారం కోసం ‘‘ఇ20 స్పాయిలేజ్ ఫండ్’ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తనిఖీల తొలి దశలో పెట్రోల్ బంకుల నుంచి రూ.6.66 లక్షల జరిమానాలు వసూలు చేసినట్లు కూడా సమాచారం. అయితే, ఈ విషయాని ఐఒసిఎల్, బిపిసిఎల్‌, హెచ్‌పిసిఎల్ తోసిపుచ్చాయి. దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్న ఈ20 పెట్రోల్ భారతీయ ప్రమాణాల సంస్థ (బిఐఎస్) నిబంధన ఐఎస్ 17021కి అనుగుణంగా ఉందని ఆ సంస్థలు ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి.

ఎంత కలిపారో చెప్పాల్సిందే..

​ ఒఎంసిల ప్రకటనపై అర్షద్ నిలదీశారు. ‘‘ఎంత కలిపారు? ఇ20నా, అంతకంటే ఎక్కువా? అనే మౌలిక ప్రశ్నకు వారు సమాధానం చెప్పలేదు. వారి ప్రకటన మొత్తం సాంకేతిక అంశాలపైనే సాగింది. మా పరీక్షల ఫలితాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని ఆయన స్పష్టం చేశారు. ఒఎంసిలు సూచించిన శాస్త్రీయ పద్ధతినే పాటించామని, నమూనాల సేకరణ మోటార్ స్పిరిట్ అండ్ హై స్పీడ్ డీజిల్ ఆర్డర్–2005కు అనుగుణంగా జరిగిందని, వాటిపై ప్రత్యేక అధికారులు, డీలర్లు సంతకాలు చేశారని చెప్పింది. సాంద్రతను అక్కడికక్కడే నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేరళం ప్రభుత్వం కర్ణాటక వెల్లడించిన 31 శాతం స్థాయిలను స్వతంత్రంగా ధ్రువీకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ నమూనాల పరీక్షలకు ఆదేశించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్