న్యూఢిల్లీ : జంతర్ మంతర్‌లో జాతీయ జెండాను ఎగురవేయడాన్ని చట్ట ఉల్లంఘనగా భావించేవారే దేశద్రోహులని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నేత అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. తీయ జెండాను ఎగురవేసినందుకు నిరసనకారులను అరెస్టు చేయడంపై ఢిల్లీ పోలీసుల చర్యలను ఖండించారు. ఈ అరెస్టుల్లో చట్టబద్ధత, నైతికత ఏమిటని ప్రశ్నించారు. నిరసన ప్రదేశంగా జంతర్ మంతర్‌ను డీనోటిఫై చేసినంత మాత్రాన ప్రజల నిరసన హక్కును అణచివేయలేరని స్పష్టం చేశారు. నిరసన ప్రదేశంగా జంతర్ మంతర్‌ను డీనోటిఫై చేసిన నేపథ్యంలో, పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటి అక్కడికి ప్రవేశించేందుకు సిజెపి కార్యకర్తలు యత్నించారు. తెల్లవారుజామున జాతీయ జెండాలతో అక్కడికి చేరుకున్న అశుతోష్ రాంకా, సౌరబ్ దాస్, అజింక్య షిండే సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసన ప్రారంభించిన కొద్దిసేపటికే భద్రతా సిబ్బంది వారిని అరెస్టు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. జాతీయ జెండాను ఎగురవేయడం ఎప్పటి నుంచి చట్ట ఉల్లంఘనగా మారిందని దీప్కే నిలదీశారు. జంతర్ మంతర్‌లో జాతీయ జెండాను ఎగురవేయడం తప్పని భావించేవారే దేశద్రోహులని అన్నారు. జాతీయ జెండాను ఎగరవేసేందుకు యత్నించిన సౌరబ్ దాస్, అశుతోష్ రాంకా, అజింక్య షిండే తదితరులపై కేసులు నమోదు చేశారని అన్నారు. ఇప్పుడు మనం ఏ దేశంలో ఉన్నామని, ఇది ఎటువంటి పాలన అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు వరకు ఆందోళనను కొనసాగిస్తామని దీప్కే ప్రకటించారు. తాము జంతర్‌మంతర్‌లో జాతీయ జెండాను ఎగరవేసి తీరుతామని స్పష్టం చేశారు.
జాతీయ జెండాను ఎగురవేయడాన్ని ఉల్లంఘనగా భావించేవారే దేశద్రోహులు : దీప్కే
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 13, 2026, 01:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)