mh ad
బుధవారం, 24 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionICC Rankings: శుభ‌మ‌న్ గిల్‌కు రెండో ర్యాంక్

1 గంట క్రితం

Shubman-Gill
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 11:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్ శుభ‌మ‌న్ గిల్ రెండో స్థానంలో నిలిచాడు. ఐసిసి బుధవారం విడుదల చేసిన తాజా వ‌న్డే బ్యాటింగ్‌లో కివీస్ బ్యాట‌ర్ డారెల్ మిచెల్ తొలి స్థానంలో నిలువగా.. గిల్‌ రెండో స్థానంలో ఉన్నాడు. మిచెల్, గిల్ మ‌ధ్య 24 రేటింగ్ పాయింట్స్ తేడా ఉండగా.. ఇటీవ‌ల ఆఫ్ఘ‌నిస్తాన్‌తో జ‌రిగిన వన్డే సిరీస్‌లో గిల్ అద్భుతంగా రాణించాడు. దీంతో అత‌ని ర్యాంకు మెరుగుప‌డింది. ఇక ఆఫ్ఘ‌న్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో అత‌నికి బ్యాటింగ్ రాలేదు. ఆ మ్యాచ్‌లో ఇండియా 9 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇక రెండు వ‌న్డేల్లో అత‌ను 84, 154 ర‌న్స్ స్కోరు చేశాడు. ఇషాన్ కిష‌ణ్ 21 స్థానాల‌ను దాటి ప్ర‌స్తుతం 43వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక టెస్టు బౌలింగ్ ర్యాంకుల్లో టాప్ ప్లేస్‌లో ఉన్న జ‌స్ప్రీత్ బుమ్రాకు స‌మంగా కివీస్ బౌల‌ర్ మ్యాచ్ హెన్రీ నిలిచాడు. ఆ ఇద్ద‌రూ ఇప్పుడూ టెస్టు బౌలింగ్ ర్యాంక్‌లో స‌మంగా ఉన్నారు. ఇక వ‌న్డే బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్ సింగ్ 22, ప్ర‌సిద్ధ కృష్ణ 58, వాషింగ్ట‌న్ సుంద‌ర్ 71వ స్థానంలో ఉన్నారు. ఆఫ్ఘ‌నిస్థాన్‌తో సిరీస్‌లో ఆడ‌ని కోహ్లి ప్ర‌స్తుతం మూడ‌వ స్థానంలో ఉన్నాడు. ఇక రోహిత్ శ‌ర్మ నాలుగో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇక టెస్టుల్లో కివీస్ బౌల‌ర్ మ్యాట్ హెన్రీ దూసుకొస్తున్నాడు. బుమ్రాతో క‌లిసి అత‌ను నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని ఆక్ర‌మించేశాడు. ఇంగ్లండ్‌తో జ‌రిగిన రెండో టెస్టులో అత‌ను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సుమారు 36 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ కివీస్ బౌల‌ర్ టాప్ ర్యాంకులో నిలిచాడు. గ‌తంలో జాక్ కోవ్‌, రిచ‌ర్డ్ హాడ్లీ ఆ అగ్ర‌స్థానానికి చేరుకున్నారు. ఇంగ్లండ్‌తో జ‌రిగిన రెండో టెస్టులో మ్యాట్ హెన్రీ 11 వికెట్లు తీసుకున్నాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్