mh ad
బుధవారం, 24 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఐర్లాండ్ బ‌య‌ల్దేరిన టీమిండియా

1 రోజు క్రితం

team india
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 10:53 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • గాయంతో సిరీస్‌‌కు దూరమైన నితీశ్‌

  • సూర్యాంశ్‌కు చోటు

చెన్నై: టీమిండియా పురుషుల జట్టు ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు బయల్దేరింది. శ్రేయస్ అయ్య‌ర్ సార‌థ్యంలోని టీమిండియా మంగ‌ళ‌వారం చెన్నై నుంచి బ‌య‌ల్దేరింది. ఈ నేప‌థ్యంలో సిరీస్‌కు ఎంపికైన న‌యా సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. చెన్నై అంత‌ర్జాతీయ ఎయిర్‌పోర్టులో టీమిండియా బృందం ప్ర‌త్యేక‌ ఫ్లైట్ ఎక్కింది. 'ఐర్లాండ్ టూర్‌కు సిద్ధం’ అన్నట్లుగా వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న స‌హ‌చ‌ర ప్లేయ‌ర్‌ అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి సెల్ఫీని పంచుకున్నాడు. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీకి ఇదే తొలి అంత‌ర్జాతీయ సిరీస్ కానుండ‌డం విశేషం. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడ‌నున్న వైభ‌వ్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయ‌నున్న అత్యంత పిన్న వ‌య‌స్కుడిగా వైభ‌వ్ రికార్డుల‌కెక్క‌నున్నాడు. శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో ఇండియా-ఏ జ‌ట్టు ట్రై సిరీస్ విజేత‌గా నిల‌వ‌డంలో వైభ‌వ్ కూడా కీల‌క‌పాత్ర పోషించాడు. శ్రీలంక‌-ఏ జ‌ట్టుతో జ‌రిగిన‌ ఫైన‌ల్లో వైభ‌వ్ 29 బంతుల్లోనే 94 ప‌రుగుల సంచ‌ల‌న ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఊపులోనే ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన‌ప్ప‌టికీ తుదిజ‌ట్టులో చోటు ద‌క్కించుకోవాలంటే ఐర్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న టీ20 సిరీస్‌లో వైభ‌వ్ త‌న ప్రతాపం చూపించాల్సిన అవ‌స‌ర‌ముంది. ఇక డుబ్లిన్ వేదిక‌గా రెండు వ‌న్డేలు ఆడ‌నున్న టీమిండియా ఆ త‌ర్వాత జూలై 1 నుంచి ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడ‌నుంది. జూలై 1 నుంచి 11 మ‌ధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు, ఆ త‌ర్వాత జూలై 14 నుంచి 19 మ‌ధ్య మూడు వ‌న్డేలు ఆడ‌నుంది. వ‌న్డే జ‌ట్టును గిల్ న‌డిపించ‌నుండ‌గా, టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు ఇదే తొలి సిరీస్ కానుంది.

సూర్యాన్ష్ షిండేకు చోటు...

ఐర్లాండ్‌‌తో జరిగే టి20 సిరీస్‌‌కు ఆల్‌రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా దూరమయ్యాడు. అత‌ని స్థానంలో సూర్యాన్ష్ షిండేను ఎంపిక చేసినట్లు భారత క్రికెట్‌ ‌కంట్రోల్‌ ‌బోర్డు(బిసిసిఐ) ఎంపిక చేసింది. దీంతో అతడు ఆఘ మేఘాలమీద భారతజట్టుతో కలిసి బయల్దేరాడు. తొలుత ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌తో జ‌రిగే టీ20 సిరీస్‌లకు బిసిసిఐ ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ తొడ కండ‌రాల గాయం వ‌ల్ల నితీశ్ రెడ్డి ఆ రెండు సిరీస్‌ల‌కు దూరమయ్యాడు. 20న ఆఫ్ఘ‌నిస్తాన్‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి గాయ‌ప‌డ్డాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్