mh ad
బుధవారం, 24 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionWomen's T20 World Cup: ఆటపట్టు సెంచరీ

1 రోజు క్రితం

chamari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 10:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఐర్లాండ్ పై 9 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపు

  • ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌

లండన్‌: ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌‌లో తొలి శతకం నమోదైంది. శ్రీలంక కెప్టెన్ ఛమారి ఆటపట్టు ఐర్లాండ్ పై అజేయ శతకంతో మెరిసింది. బ్రిస్టల్ వేదికగా ఐర్లాండ్ తో మంగళవారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్ లో ఐర్లాండ్ నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక కెప్టెన్ ఆటపట్టు (106నాటౌట్; 61బంతుల్లో 17ఫోర్లు, 2సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. దులానీ(20) సాయంతో టి20ల్లో ఆటపట్టు తొలి శతకాన్ని నమోదు చేసింది. దీంలో శ్రీలంక 15.3ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి 134 పరుగులు చేసి సునాయాంగా లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఐర్లాండ్ కెప్టెన్ లూవిస్(59) అర్ధసెంచరీకి తోడు టెక్టర్(28నాటౌట్)బ్యాటింగ్ లో రాణించారు.

అంతకుముందు జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు 6 వికెట్ల తేడాతో స్కాట్లాండ్ పై గెలిచింది. స్కాట్లాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 131 పరుగులు చేయగా.. న్యూజిలాండ్‌ ‌మిడిలార్డర్‌ ‌బ్యాటర్‌ ‌షార్ఫ్‌(62) అర్ధసెంచరీకి తోడు హెలిడే(41నాటౌట్‌) ‌బ్యాటింగ్‌‌లో రాణించడంతో 18.2ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. చివరి లీగ్‌ ‌మ్యాచ్‌‌లో న్యూజిలాండ్‌ ‌జట్టు ఆతిథ్య ఇంగ్లండ్‌తో శ్రీలంక జట్టు స్కాట్లాండ్ తో తలపడనున్నాయి.


మహిళల టి20 ప్రపంచకప్‌లో నేడు...

ఇంగ్లండ్‌ - ‌వెస్టిండీస్‌

(వేదిక: లార్డ్స్‌; సమయం: రా.11.00గం.లకు)


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్