అమరావతి : ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించే అంశంపై అధికారులకు సిఎం దిశానిర్దేశం చేశారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలన్నారు. ఈ మేరకు సేవల సులభతర ప్రక్రియ మొదలు పెట్టామని.. తొలుత 11 రకాల సేవల్లో అంశాలను కుదిస్తున్నామని అధికారులు వివరించారు. ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేసే అవకాశాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ‘మనమిత్ర’ వాట్సప్‌లోనూ ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించాలని సూచించారు. వాయిస్ మెసేజ్‌లు పెట్టినా ఫిర్యాదులుగా స్వీకరించేలా చూడాలని సిఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. సుమారు 3 వేల ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని.. మూడు నెలల్లో సమస్య పరిష్కరించాలన్నారు. ఈ మేరకు నెట్‌వర్క్ సంస్థలతో మాట్లాడాలని సూచించారు.
ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించేలా చర్యలు : అధికారులకు సిఎం చంద్రబాబు ఆదేశాలు
19 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 29, 2026, 03:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)