mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత - కేతిరెడ్డి హౌస్ అరెస్ట్

4 రోజుల క్రితం

police security
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 11:09 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తాడిపత్రి (అనంతపురం) : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం వైసిపి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ... పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో టిడిపి దాడులకు నిరసనగా ... గాంధీ కూడలిలో దీక్ష చేపడతామని కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. దీనిపై టిడిపి నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో టిడిపి నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసిన వారు ఇప్పుడు దీక్ష చేయడం సమంజసం కాదని దీక్ష చేస్తే అడ్డుకుంటామని టిడిపి నేతలు హెచ్చరించారు. జిల్లాలో పోటాపోటీగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాలు సిద్ధమయ్యాయి. జిల్లాలో మొహరం వేడుకలు, వీవీఐపీల పర్యటన నేపథ్యంలో తగిన భద్రతా బలగాలను కేటాయించడం సాధ్యం కాదని పేర్కొంటూ ... ఇరు పార్టీల కార్యక్రమాలకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. ప్రజా శాంతి, భద్రతకు సహకరించాలని కోరుతూ ... టిడిపి, వైసిపి నేతలకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని గృహ నిర్బంధం చేసి ఆయన నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. తాడిపత్రిలోని గాంధీ సర్కిల్‌తో పాటు ప్రధాన కూడళ్లు, సున్నిత ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. పట్టణంలోని అన్ని కీలక ప్రాంతాల్లోనూ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్