కార్తీక్ గురుకుల పాఠశాలలో తొమ్మిదోవ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు మొదలవగానే కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్లాడు. అక్కడ కొద్ది రోజులు ఉండి, తర్వాత వాళ్ల అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లాడు. కార్తీక్ వాళ్ల అమ్మమ్మ ఇల్లు అంటే చాలా ఇష్టం. కానీ అక్కడికి వెళ్ళక చూస్తే అమ్మమ్మ వాళ్ళు కొత్తగా కట్టిన ఇంట్లోకి మారారు.
కార్తీక్ కి పాత ఇల్లు అంటేనే ఇష్టం. కొత్త ఇంట్లో ఉండడం నచ్చలేదు. కార్తీక్ వచ్చిన మరుసటి రోజే అమ్మమ్మ పిండి వంటలు చేసింది. ఎప్పటిలాగానే మామయ్య కార్తీక్ ను ఈతకు తీసుకెళ్లాడు. రోజూ పొలం దగ్గరికి వెళ్లేవాడు. తాతయ్య అయితే కార్తీక్ కోసం అని గంపనిండుగా మామిడి పండ్లు తీసుకొచ్చాడు. కార్తీక్ పిండి వంటలు, మామిడిపండ్లు రోజూ తినేవాడు. రాత్రివేళల్లో తాతయ్య చెప్పే కథలు శ్రద్ధగా వినేవాడు. అలా చూస్తుండగానే రోజులు గడిచాయి. కార్తీక్ కి ఒక విషయం అర్థం అయింది. 'మారింది ఇల్లు మాత్రమే మనుషులు కాదు` అని. అమ్మమ్మ చూపించే ప్రేమ, తాతయ్య మనసు, మామయ్య ఆత్మీయత ఏమీ మారలేదు. సెలవులు అయిపోవడంతో కార్తీక్ తిరిగి ఇంటికి వెళ్లే సమయం దగ్గర పడింది. అమ్మమ్మ చాలా బాధపడింది. ఇంట్లో వాళ్లను వదలలేక కార్తీక్ ఏడ్చాడు. మనసులో మళ్ళీ వేసవికి ఇక్కడికే రావాలని అనుకొని తిరిగి బడికి వెళ్ళాడు. వేసవి సెలవులు అంటే పిల్లలకు ప్రేమానుబంధాల పండుగ. అందులో అమ్మమ్మ ఇల్లంటే ఆత్మీయ అనురాగాల తోట. ఎన్నిసార్లు వెళ్లినా, రావాలని అనిపించదు.
- టి. కల్యాణ్ రామ్, 10వ తరగతి,
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల
పాఠశాల, దేవరకద్ర, మహబూబ్ నగర్.









కామెంట్‌లు (0)