ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : స్థానిక కండ్రికపేట ప్రాథమిక పాఠశాలలో టీడీపీ మండల అధ్యక్షులు ఈదల సత్తిబాబు చేతుల మీదుగా పారిశ్రామికవేత్త రావాడ నరేష్ సుమారు రూ. 10 వేలు వెచ్చించి సమకూర్చిన నోటు పుస్తకములు, పెన్నులు, పెన్సిల్లు, షార్ప్నర్లు, పలకలు, స్లేట్ పెన్సిల్లు, క్రేయాన్సు, స్కెచ్ లు విద్యార్థులందరికీ శనివారం అందజేశారు. ప్రతి ఏటా ఇదే విధంగా ఈ పాఠశాలకు దాత నరేష్ విద్యార్థులందరికీ ఉచితముగా విద్యాసామాగ్రి అందజేయడం చాలా సంతోషమని ఆయన ప్రశంసించారు. అలాగే ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను సక్రమంగా ఉపయోగించుకుని నిరంతరం పాఠశాలకు హాజరై మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ ఈదల నల్లబాబు, పిఎసిఎస్ అధ్యక్షులు వంటిపల్లి సతీష్, మాజీ జడ్పిటిసి రామానుజల శేషగిరిరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కేతా రాంబాబు, రావాడ నరేష్, గుత్తుల కిరణ్, గోపి, మానేపల్లి శ్రీనివాసు, పి ఎం సి చైర్మన్ అరవాలమ్మ, హెచ్ఎం అద్దరి శ్రీనివాస్, ఉపాధ్యాయులు పిల్లి రాంబాబు, సి.ఆర్.ఎంటి జ్యోతి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విద్యార్థులకు విద్యాసామగ్రి అందజేత
20 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 20, 2026, 03:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)