నెల్లూరు : దేశంలోనే మెగా ఫర్నిచర్ పార్క్ గూడూరులో వస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బుధవారం నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెం ప్రజావేదిక సభలో చంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ ... పేదలకు అండగా ఉంటూ సంక్షేమం అందిస్తున్నామన్నారు. పేదరిక నిర్మూలనకు అందరూ కృషి చేయాలని, పి 4 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పేదవారందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తామన్నారు. డ్వాక్రా సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఇంటికో పారిశ్రామికవేత్త తయారు కావాలని కోరారు. అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో ఎపి చాలా ముందుందన్నారు. దేశంలోనే మెగా ఫర్నిచర్ పార్క్.. గూడూరులో వస్తోందని ప్రకటించారు. పది వేల మందికి ఉపాధి కల్పించబోతున్నామన్నారు. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఎపి కే వస్తున్నాయన్నారు. ఒకప్పుడు పెట్టుబడిదారులు పారిపోయారని, ఇప్పుడు రాష్ట్రాన్ని వెతుక్కుంటూ వస్తున్నారని అన్నారు. నమ్మకం కలిగించినందుకే రాష్ట్రానికి క్యూ కడుతున్నారు అని చంద్రబాబు ప్రసంగించారు.
గూడూరులో మెగా ఫర్నిచర్ పార్క్ వస్తోంది : సిఎం చంద్రబాబు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 01, 2026, 02:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)