ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : ఖరీఫ్ సీజన్ కు ఏపీఏఐఎంఎస్ 2.0 విధానం ద్వారా జొన్నాడ సొసైటీలో నూతనంగా ఎరువుల విక్రయాలు ప్రారంభమయ్యాయని, స్థానిక రైతుల కల నేరవేరిందని సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ నాగిరెడ్డి వెంకటరత్నం లు వ్యాఖ్యానించారు. మండలంలోని చొప్పెల్ల సొసైటీలో అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అధ్యక్షతన రైతులకు యూరియా, డిఎపి అమ్మకాలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరువులు కొరత లేదని అందుబాటులో స్టాక్ పెడుతున్నామని, రైతులు వదంతులను నమ్మవద్దని సూచించారు. ఎరువుల కొనుగోలుకు ఆధార్ ద్వారా పొలం వివరాలతో యూరియా, డిఏపి అర్హతను బట్టి అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఈవో నాగిరెడ్డి రాజు, సొసైటీ సభ్యులు నాగిరెడ్డి స్వామి, పంపన సురేష్, కూటమి నేతలు నాగిరెడ్డి సత్యానందం, కొత్తపల్లి రాంబాబు, సిరంగుల సతీష్, అడబాల వీర్రాజు, పేరపు చిన్న, విఏఏ లు, రైతులు పాల్గొన్నారు.
చొప్పెల్ల సొసైటీలో ఎరువుల అమ్మకం ప్రారంభం
20 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 20, 2026, 03:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)