mh ad
బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మొక్కలు నాటి ఆరోగ్య రక్షణకు బాటలు వేయండి : డిసి చైర్మన్ గోపాలస్వామి

20 జూన్, 2026

Plant saplings and pave the way for better health: DC Chairman Gopalaswamy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 02:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి ఆరోగ్య రక్షణకు బాటలు వేయాలని ఆలమూరు డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి పిలుపునిచ్చారు. మేరకు శనివారం చొప్పెల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో వైద్యాధికారిని ఎన్ డాక్టర్ ఎన్ లక్ష్మీ స్నేహ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "పచ్చదనం పరిశుభ్రత" కార్యక్రమానికి ఆయన విచ్చేసి జామ మొక్కను నాటారు. ముందుగా వారంతా స్వచ్ఛభారత్ స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి ఒక్కరూ కొంత సమయం కేటాయించాలన్నారు. తమ వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉండాలన్నారు. రోజు పరిశుభ్రత గురించి మనం వేసిన ఈ ముందడుగు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతున్నానన్నారు. అందరికీ “స్వచ్ఛత” పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తూ భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. మనతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రాన్ని “స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర” గా తీర్చిదిద్దేటట్లు మన వంతు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు జాంపోలు వెంకట్రావు, ఎంపీహెచ్ఈవో కె.జ్యోతి కుమార్, హెచ్ఐ బి.సూర్యనారాయణ, ఎంఎల్హెచ్పిలు కుమార్, అచ్చామని, సూపర్వైజర్లు పి.శివప్రసాద్, ఆర్.బాలమణి, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్