mh ad
బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సఖినేటిపల్లి యువతి నరసాపురంలో దారుణ హత్య

21 జూన్, 2026

Young woman from Sakinetipalli brutally murdered
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 12:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - సఖినేటిపల్లి : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి గ్రామానికి చెందిన వివాహిత ఆదివారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో దారుణ హత్యకు గురైంది. సఖినేటిపల్లి లాకుపేటకు చెందిన జాలెం టీనారోజా(31) సూళ్లూరుపేట నుండి నరసాపురానికి రైలులో ప్రయాణించి ఆదివారం ఉదయం చేరుకుంది. రైల్వే స్టేషన్ వద్ద నుండి కారులో స్వగ్రామం సఖినేటిపల్లికి చేరుకుంటుండగా అదే కారులో ప్రయాణిస్తున్న సఖినేటిపల్లి లంక గ్రామానికి చెందిన మార్గాని రమేష్ ఆమెపై కత్తితో దాడి చేసి హత మార్చారు. అడ్డుకున్న డ్రైవర్ కు సైతం గాయాలు కాగా స్థానిక నర్సాపురం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. మృతురాలు టీనా రోజాకు ఇద్దరు సంతానం కాగా, ఆమె భర్త ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉన్నారు. ఆమె సూళ్లూరుపేటలో ఏఎన్ఎంగా పనిచేస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు. నరసాపురం పోలీసులు నుండి హత్యా సమాచారాన్ని కుటుంబ సభ్యులు తెలుసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. హత్యకు గల కారణాలు తెలియాల్సివుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్