ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : భాకరాపేట ఘాట్ రోడ్డులో గ్రానైట్ లారీ దూసుకెళ్లింది. అయితే తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన బుధవారం చంద్రగిరిలో జరిగింది. చంద్రగిరి మండల పరిధిలోని తిరుపతి, మదనపల్లె జాతీయ రహదారిలో గ్రానైట్ రాళ్ళు లోడ్డుతో వస్తున్న లారీ భాకరాపేట ఘాట్ రోడ్డులో మలుపు వద్దకు రాగానే అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. రోడ్డు పక్కన రక్షణ గోడ ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే సుమారు వంద అడుగుల లోయలో పడుండేది. రక్షణ గోడ వలన పెను ప్రమాదం తప్పంది. డ్రైవర్,క్లీనర్ క్షేమంగా బయటపడ్డారు.
లోయలోకి దూసుకెళ్లిన లారీ - తృటిలో తప్పిన పెనుప్రమాదం
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 24, 2026, 04:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)