ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. సూర్య ప్రధాన పాత్రలో టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో సూర్య సినీ ప్రస్థానాన్ని ప్రశంసిస్తూ, ‘‘ఆయన ఫ్రేమ్ బై ఫ్రేమ్.. ఫిల్మ్ బై ఫిల్మ్.. ఫైట్ బై ఫైట్.. తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. నిజాయితీతో కూడిన పాత్రలు, యథార్థ జీవితాలను ప్రతిబింబించిన క్యారెక్టర్లతో మూడు దశాబ్దాలుగా అద్భుత ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుత తరంలోని సాహసోపేత నటుడికి హోంబలే ఫిల్మ్స్ సాదర స్వాగతం పలుకుతోంది’’ అని పేర్కొంది. విజయ్ కిరగందూర్, చలువే గౌడ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాయదు లోహర్ హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఇతర వివరాలను త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.
Print Editionసూర్యతో హోంబలే ఫిల్మ్స్ భారీ చిత్రం
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 29, 2026, 09:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)