mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రజలకు బీర్ కాదు.. బతుకు భరోసా ఇవ్వండి : ఐద్వా

11 గంటల క్రితం

aidwa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 12:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యలను ఐద్వా రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. మద్యం వినియోగాన్ని ప్రోత్సహించేలా ప్రజా ప్రతినిధులు తరచూ వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె శ్రీదేవి, వి సావిత్రి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కూల్ డ్రింక్‌‌తో పోలిస్తే బీరులోనే చక్కెర, క్యాలరీల శాతం తక్కువగా ఉంటుందని చెప్పడం ద్వారా ప్రజలను, ముఖ్యంగా యువతను మద్యం వైపు ప్రోత్సహించే ప్రయత్నమే పల్లా చేశారని విమర్శించారు. అరోగ్యానికి హానికరమైన మద్యాన్ని శీతల పానీయాలతో పోల్చి సమర్థించడం ప్రజా ప్రతినిధులకు తగదన్నారు. అదే విధంగా, రాష్ట్రంలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయడం మంచిదేనని, వాటివల్ల విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని, బీచ్ వద్ద మధ్యం షాపులు ఏర్పాటు చేసినా సంస్కృతి దెబ్బతినదని చెప్పడం పూర్తిగా ప్రజలను తప్పుదారి పట్టించే వాదన అని పేర్కొన్నారు. పర్యాటకాభివృద్ధి అంటే మద్యం విక్రయాల విస్తరణ కాదని, కుటుంబాలకు అనుకూలమైన పర్యాటక వసతులు, భద్రత, మౌలిక సదుపాయాలు కల్పించడమే నిజమైన అభివృద్ధి అని స్పష్టం చేశారు. ప్రజలకు బీర్ కాదు.. ఉపాధి, కనీస వేతనాలు, సంక్షేమం ఇవ్వాలని, బీచ్‌‌లను మద్యం కేంద్రాలుగా కాకుండా కుటుంబ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ‌కోరారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్