mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రెండేళ్లలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు : మంత్రి టిజి భరత్

1 గంట క్రితం

Minister TG Bharat
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 11:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గత రెండేళ్లలో రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినట్లు పరిశ్రమలశాఖ మంత్రి టిజి భరత్ వెల్లడించారు. రాష్ట్ర ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా రూ.7.66 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని, కొత్తగా కల్పించే ఉద్యోగాలను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. విశాఖలో గూగుల్ ఎఐ డేటా సెంటర్, అమరావతిలో క్వాంటం వ్యాలీ, ఎలక్ట్రానిక్స్ హబ్‌ల వంటి మెగా ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. పరిశ్రమల పేరుతో భూములు తీసుకుని ప్రాజెక్టులు ప్రారంభించని సంస్థలకు ఇప్పటికే 900 నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. కర్నూలులో టమాటో ప్రాసెసింగ్ ప్లాంట్, అనకాపల్లిలో పనస, మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్లు త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి, ఎపిఐఐసి ఎమ్‌డి దినేష్ కుమార్, ఇండస్ట్రీస్ శాఖ డైరెక్టర్ ఎస్ బన్సాల్, ఫుడ్ ప్రాసెసింగ్ సోసైటీ సిఇఒ జి శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్