mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిశాఖలో భాగస్వామ్య సదస్సు

11 గంటల క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 11:50 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నవంబర్ 12, 13 తేదీల్లో నిర్వహణకు నిర్ణయం

  • ఎంఒయులు, పెట్టుబడులతోపాటు *నాలెడ్జ్ షేరింగ్ పై ఎక్కువ దృష్టి

  • సిఐఐ భాగస్వామ్య సదస్సు-2026 సన్నాహాక సమావేశంలో సిఎం చంద్రబాబు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : నవంబరులో మరోసారి భాగస్వామ్య సదస్సును నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ సదస్సు ఏర్పాట్లపై అధికారులు, మంత్రులతో సోమవారం ఆయన సమీక్షించారు. ఈ భాగస్వామ్య సదస్సు గతానికి భిన్నంగా నిర్వహించాలని, అంతకుముందే ప్రాంతీయ స్థాయిలో కూడా సదస్సులు నిర్వహించాలని సూచించారు. నవంబరు 12, 13 తేదీల్లో విశాఖలో సిఐఐ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. నావిగేటింగ్ చేంజ్, లీడర్షిప్, టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్ ఇన్ ట్రాన్సఫార్మింగ్ వరల్డ్ థీమ్‌తో 31వ పార్ట్‌‌నర్‌‌షిప్‌ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం, మినిస్టీరియల్ సెషన్స్, ప్లీనరీ, కంట్రీ సెషన్స్, బి2బి, బి2జి చర్చలతో రెండు రోజుల భాగస్వామ్య సదస్సు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లూ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, వివిధ దేశాల డెలిగేట్స్‌ను ఆహ్వానించి, రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించాలన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయాలని అధికారులకు సూచించారు. సదస్సుకు సంబంధించి జులై నుంచి సెప్టెంబరు వరకు దేశ విదేశాల్లో రోడ్ షోలు నిర్వహించాలన్నారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబయి, కోయంబత్తూర్, అహ్మదాబాద్, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లోనూ రోడ్ షోల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రధాన సదస్సు కంటే ముందుగానే విశాఖ, రాజమండ్రి, కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతి నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సమావేశాలు నిర్వహించాలన్నారు. విశాఖలో జరగబోయే పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్లో పబ్లిక్ పాలసీలపై కీలక చర్చలు జరగాలన్నారు. వ్యాపారాలు, పెట్టుబడులు వంటి అంశాలతోపాటు ఆయా రంగాల్లో సవాళ్లు ఎదురైతే వాటిని ఎలా అధిగమించాలనే వాటిపై చర్చలు జరగాలన్నారు. వ్యవసాయం, ఉద్యాన రంగం, ప్రకృతి వ్యవసాయం, సర్క్యులర్ ఎకానమీ, ఆధ్యాత్మికత, స్ట్రెస్ ఫ్రీ వర్క్ వంటి అంశాలపై చర్చించాలని ముఖ్యమంత్రి సూచించారు.

జెన్‌‌జికి ప్రాధాన్యం

యువతలోని ఇన్నోవేషన్లు ఆయా రంగాల పారిశ్రామిక పెద్దల దృష్టికి తీసుకెళ్లడం సాధ్యమవుతుందని, ఈ సదస్సులో జెన్‌‌జి భాగస్వామ్యం ఉండేలా చూడాలని చెప్పారు. ఈ సన్నాహక సమీక్షా సమావేశానికి మంత్రులు టిజి భరత్, కొండపల్లి శ్రీనివాస్, పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్