mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరెండో దశ ఉద్యమ కార్యాచరణపై ముఖ్యమంత్రికి వినతి : ఆర్‌‌టిసి జెఎసి

12 గంటల క్రితం

ఆర్‌టిసి
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 11:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిపిటిడి (ఆర్‌‌టిసి) ఉద్యోగ సంఘాల జెఎసి ప్రకటించిన రెండో దశ ఉద్యమ కార్యాచరణ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లేందుకు, ఆయన కార్యాలయంలో సోమవారం వినతిపత్రం అందజేసినట్లు జెఎసి కన్వీనర్లు వై శ్రీనివాసరావు, పి దామోదరరావు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణాశాఖ మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఎపిఎస్‌ఆర్‌‌టిసి వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయాల్లోనూ ఈ వినతిపత్రాలను అందించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జెఎసి కన్వీనర్లు మాట్లాడుతూ.. ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను ఎపిఎస్‌ఆర్‌‌టిసి ప్రవేశపెట్టి సంస్థను దశలవారీ ప్రైవేటీకరించే చర్యలను జెఎసి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్‌‌టిసి ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, పెండింగ్ డిమాండ్ల సాధన, సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల హక్కుల రక్షణ లక్ష్యంగా రెండో దశ ఉద్యమ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. జెఎసి ప్రకటించిన ఉద్యమ షెడ్యూల్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు సంబంధిత ప్రజా ప్రతినిధులకు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేసినట్లు వెల్లడించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యక్రమాలను మరింత ఉధృతం చేయనున్నట్లు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్