mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సమస్యలు పరిష్కరించండి

1 గంట క్రితం

AP Agricultural Market Committees Outsourcing Employees' Union
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 11:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎపి వ్యవసాయ మార్కెట్‌ ‌కమిటీల అవుట్‌సోర్సింగ్‌ ‌ఉద్యోగుల యూనియన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పనిచేస్తున్న అవుట్‌‌సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైమ్‌స్కేల్ జీతాలు చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఎపి వ్యవసాయ మార్కెట్‌ ‌కమిటీల అవుట్‌సోర్సింగ్‌ ‌ఉద్యోగుల యూనియన్‌ ‌రాష్ట్ర కమిటీ డిమాండ్‌ ‌చేసింది. రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ‌ల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్‌ను యూనియన్‌ ‌నాయకులు కలిసి వినతిపత్రాన్ని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ ‌గౌరవాధ్యక్షులు కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. మార్కెట్‌ ‌కమిటీల్లోని అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, పెన్షన్, ప్రమాద బీమా రూ.10 లక్షలు వర్తింపజేయాలని, ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ స్పందిస్తూ.. మినిమం టైమ్‌ స్కేల్ సమస్య ప్రభుత్వ పరిధిలో ఉందని, అవుట్‌‌సోర్సింగ్ ఉద్యోగుల కోర్కెలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందించిన వారిలో యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె వీరన్న, ప్రధాన కార్యదర్శి పి మధు, కార్యవర్గ సభ్యులు కెవి సుబ్బన్న, రాఘవ తదితరులు ఉన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్