mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎఇఇ పరీక్షలకు సమయం ఇవ్వాలి : డివైఎఫ్ఐ

1 గంట క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 11:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలం తర్వాత విద్యుత్‌, టెలికాం, సివిల్ సంస్థలు ఎఇఇ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిందని, పరీక్షలకు వ్యవది ఉండటం వల్ల అభ్యర్థుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని పరీక్షల తేదీలను పొడిగించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై రాము, జి రామన్న మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఎఇఇ నోటిఫికేషన్‌ విడుదల కావడం అభ్యర్థులకు హర్షణీయమైన వార్త అయినప్పటికీ, సిలబస్‌లో మార్పులు చేసి, అన్ని సంస్థలకూ ఒకే పరీక్ష నిర్వహిస్తుండగా అభ్యర్థులకు సిద్ధం కావడానికి తగిన సమయం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలు, నాణ్యమైన స్టడీ మెటీరియల్ వంటి సౌకర్యాలు పరిమితంగా ఉండటం వల్ల కొత్త సిలబస్‌కు తక్కువ సమయంలో సిద్ధం కావడం చాలా కష్టంగా మారుతుందన్నారు. అందువల్ల అభ్యర్థులందరికీ సమాన అవకాశం కల్పించేలా ఎఇఇ పరీక్షను కొంతకాలం వాయిదా వేసి, సన్నద్ధమయ్యేందుకు మరికొంత సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్, నియామక ప్రక్రియలు వివాదాలు లేకుండా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్