mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆంధ్ర ప్రీమియర్‌ ‌లీగ్‌ ‌విజేత భీమవరం బుల్స్‌

1 గంట క్రితం

Bhimavaram Bulls
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 12:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఫైనల్లో సింహాద్రి వైజాగ్‌ ‌లయన్స్‌‌పై గెలుపు

ప్రజాశక్తి-స్పోర్ట్స్‌ ‌కరస్పాండెంట్‌ : ఆంధ్ర ప్రీమియర్‌ ‌లీగ్‌ ‌టైటిల్‌‌ను భీమవరం బుల్స్‌ ‌చేజిక్కించుకుంది. అమరావతిలోని ఎసిఎ ఇంటర్నేషనల్‌ ‌స్టేడియంలో మంగళవారం జరిగిన ఫైనల్లో భీమవరం బుల్స్‌ ‌జట్టు 10 వికెట్ల తేడాతో సింహాద్రి వైజాగ్‌ ‌లయన్స్‌‌పై ఘన విజయం సాధించింది. సింహాద్రి లయన్స్‌ ‌నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని భీమవరం బుల్స్‌ ఓపెనర్లు కేవలం 9 ఓవర్లలోనే బాదేశారు. భీమవరం ఓపెనర్లు హేమంత్‌ ‌రెడ్డి(59నాటౌట్‌; 23బంతుల్లో 6ఫోర్లు, 4సిక్సర్లు), రేవంత్‌‌రెడ్డి(71నాటౌట్‌; 33బంతుల్లో 10ఫోర్లు, 3సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో ఆ జట్టు కేవలం 9ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు టాస్‌ ‌గెలిచిన సింహాద్రి లయన్స్‌ ‌కెప్టెన్‌ ‌రికీ బుయ్‌ ‌బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఓపెనర్లు హిమకర్‌ (17), రికీ బుయ్‌(9)కి తోడు హనీష్‌‌ రెడ్డి(15), మహీప్‌ ‌కుమార్‌(9) ‌త్వరగా పెవీలి యన్‌‌కు చేరారు. ఆ తర్వాత త్రిపురన విజయ్‌(39), బి. వినయ్‌(19) ‌రాణించడంతో సింహాద్రి జట్టు గౌరవ ప్రద స్కోర్‌ ‌చేసింది. భీమవరం బౌలర్లు రవితేజకు మూడు, రవికిరణ్‌, యశ్వంత్‌, హేమంత్‌‌రెడ్డి, శ్రావణ్‌‌కు ఒక్కో వికెట్‌ ‌దక్కాయి. దీంతో జూన్ 9నుంచి ప్రారంభమైన టోర్నీ జూన్ 30న అమరావతిలో జరిగిన ఫైనల్ తో ముగిసింది. ఏడుజట్ల మధ్య మొత్తం 28 మ్యాచులు జరిగాయి. అంతిమ విజేతగా భీమవరం బుల్స్ జట్టు నిలిచింది. ప్రారంభ మ్యాచ్ లు విశాఖలో జరగ్గా.. ఆ తర్వాత కడపలో మిగిలిన మ్యాచులు జరిగాయి. చివరి క్వాలిఫయర్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ లకు అమరావతిలోతి ఎసిఎ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగాయి. విజేతలకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి నారా లోకేశ్ బహుమతులను అందజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్