mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జురెల్‌ ‌సెంచరీ

4 రోజుల క్రితం

cricket
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 10:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇండియా-ఎ 452/6 డిక్లేర్డ్‌

శ్రీలంక-ఎతో తొలి అనధికారిక టెస్ట్‌

‌గాలే: శ్రీలంక- ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్‌‌లో ఇండియా-ఎ కెప్టెన్‌ ‌ధృవ్‌ ‌జురెల్‌ అజేయ శతకంతో మెరిసాడు. రషీద్‌ కూడా అర్ధసెంచరీతో రాణించడంతో రెండోరోజు ఆట ముగిసేసరికి ఇండియా-ఎ జట్టు 6 వికెట్ల నష్టానికి 452 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ ‌డిక్లేర్డ్‌ ‌చేసింది. ఓవర్‌ ‌నైట్‌ ‌స్కోర్‌ 4 వికెట్ల నష్టానికి 333 పరుగులతో శుక్రవారం రెండోరోజు ఆటను కొనసాగించిన భారతజట్టును రషీద్‌ ‌ఖాన్‌, ధృవ్‌ ‌జురెల్‌ ఆదుకున్నారు. ప్రారంంభంలోనే షేక్‌ రషీద్‌ (63) వికెట్‌ కోల్పోయింది. అయితే, కెప్టెన్‌ జురెల్‌ మాత్రం జోరు కొనసాగించాడు. ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ 97 పరుగుల వద్ద ఉండగా వర్షం అంతరాయం కలిగించడంతో ఆట నిలిచింది. ఆ తర్వాత వర్షం తగ్గాక జురెల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు.. హర్ష్‌ దూబే 30 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో భారత్‌ 111.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 452 పరుగులు స్కోరు చేసింది. ధ్రువ్‌ జురెల్‌ 141, సారాంశ్‌ జైన్‌ 3 పరుగులతో క్రీజులో నిలిచారు. టీ బ్రేక్‌ తర్వాత భారతజట్టు కెప్టెన్‌ ‌ధృవ్‌ ‌జురెల్‌ ఇన్నింగ్స్‌‌ను డిక్లేర్డ్‌ ‌చేస్తున్నట్లు ప్రకటించాడు. జురెల్‌181 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కాగా రెండు అనధికారిక టెస్టుల సిరీస్‌ ఆడేందుకు భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్