mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

​తొలి టి20లో టీమిండియాకు నిరాశ

4 రోజుల క్రితం

irland
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 10:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఐర్లాండ్‌ ‌చేతిలో 34 పరుగుల తేడాతో ఓటమి

బెల్‌‌ఫాస్ట్‌(ఐర్లాండ్‌): ఐర్లాండ్‌‌తో వైట్‌‌బాల్‌ ‌సిరీస్‌ ఆడేందుకు వెళ్లిన భారత పురుషుల జట్టుకు తొలి మ్యాచ్‌‌లోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రెండు టి20ల సిరీస్‌‌లో భాగంగా ఐర్లాండ్‌‌తో జరిగిన తొలి మ్యాచ్‌‌లో భారతజట్టు 34 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలిగా బ్యాటింగ్‌‌కు దిగిన ఐర్లాండ్‌ ‌జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్‌ ‌చేయగా.. అనంతరం భారతజట్టు 18.5ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో భాగంగా ఓపెనర్‌ అభిషేక్‌ ‌శర్మ(50) అర్ధసెంచరీకి తోడు దూబే(25), తిలక్‌ ‌వర్మ(19), అక్షర్‌(15) ‌మాత్రమే రెండంక్కెల స్కోర్‌ ‌చేశారు. సంజు శాంసన్‌(5), ఇషాన్‌ ‌కిషన్‌(1), కెప్టెన్‌ ‌శ్రేయస్‌ అయ్యర్‌(3), సుందర్‌(9) ‌సింగిల్‌ ‌డిజిట్‌‌కే పెవీలియన్‌‌కు చేరారు. ఐర్లాండ్‌ ‌బౌలర్లు మాథ్యూ, హోలార్డ్‌‌కు మూడేసి, మూంద్రాకు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన ఐర్లాండ్‌‌కు టాపార్డర్‌ ‌బ్యాటర్లు నిరాశపరిచినా.. కెప్టెన్‌ ‌టక్కెర్‌(50), డెలానీ(49) ఆదుకున్నారు. లోయర్‌ ఆర్డర్‌‌లో డోక్రెల్‌(19) ‌రాణించడంతో ఐర్లాండ్‌ ‌జట్టు భారీస్కోర్‌ ‌నమోదు చేసింది. టీమిండియా బౌలర్లు హర్షిత్‌ ‌రాణాకు మూడు, ఆర్ష్ దీప్‌, అక్షర్‌‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ‌ది మ్యాచ్‌ ‌హోలార్డ్‌‌కు దక్కింది. దీంతో ఐర్లాండ్‌ ‌జట్టు 1-0 ఆధిక్యతలో నిలువగా.. రెండో, చివరి టి20 ఆదివారం జరగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్