లండన్: ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్లోకి 6సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టు ప్రవేశించింది. కెన్నింగ్‌టన్ వేదికగా మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు 8వికెట్ల తేడాతో వెస్టిండీస్ మహిళలపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ మహిళలు 20ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేసింది. కెప్టెన్ మాథ్యూస్(30), క్యాంప్‌బెలె(26)కి తోడు లోయర్ ఆర్డర్‌లో డోటిన్(26) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లు మోలినెక్స్, గార్డినర్, వారేహామ్‌లకు రెండేసి, సథర్లాండ్‌కు ఒక వికెట్ దక్కాయి. అనంతరం ఆస్ట్రేలియా ఓపెనర్, వికెట్ కీపర్ మూనీ(61నాటౌట్; 36బంతుల్లో 8ఫోర్లు), గార్డినర్(35నాటౌట్; 20బంతుల్లో 4ఫోర్లు, సిక్సర్) రాణించడంతో 13ఓవర్లలో 2వికెట్లు కోల్పోయి 127పరుగులు చేసి ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ బౌలర్లు మాథ్యూస్, హెన్రీకి ఒక్కో వికెట్ దక్కాయి. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ మహిళల మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో ఫైనల్లో ఆస్ట్రేలియా తలపడనుంది.
Women's T20 World Cup: ఫైనల్‌కు ఆస్ట్రేలియా
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 30, 2026, 11:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)