లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత నొవాక్ జకోవిచ్‌తోపాటు 3వ సీడ్, కెనడాకు చెందిన అగర్ అలియాన్సిమ్ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో జకోవిచ్ 6-4, 5-7, 6-4, 6-4తో చైనాకు చెందిన అన్‌సీడెడ్ వై. వును ఓడించాడు. ఇక అగర్ 6-4, 6-1, 6-4తో కజకిస్తాన్‌కు చెందిన షెన్సికోను చిత్తుచేశాడు. ఇతర పోటీలో 28వ సీడ్, అమెరికాకు చెందిన నకాషిమా 6-3, 7-6(7-5), 7-5తో బ్రిటన్‌కు చెందిన జాక్‌ను, 8వ సీడ్ మెద్వదెవ్ 6-1, 6-2, 6-4తో వరుససెట్లలో క్రొయేషియాకు చెందిన సిలిక్‌ను ఓడించాడు. ఇక 5వ సీడ్ డి-మినర్(ఆస్ర్టేలియా) 7-6(7-5), 6-1, 6-0తో బురుచ్ఛగా(అర్జెంటీనా)ను ఓడించారు.
ఇక మహిళల సింగిల్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ మీర్రా ఆండ్రీవా వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో పోలండ్‌కు చెందిన మాగ్డా లినెట్‌పై 7-5, 6-4 సెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. టోర్నీలో ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ 19 ఏళ్ల ఆండ్రీవా.. తన తదుపరి రౌండ్‌లో డిఫెండింగ్ వింబుల్డన్ ఛాంపియన్ బార్బోరా క్రెజికోవాతో తలపడనుంది. పోలిని(ఇటలీ), 6వ సీడ్ అనిసిమోవా(అమెరికా) ప్రత్యర్ధులను ఓడించి రెండోరౌండ్‌కు చేరారు. అనిసిమోవా 6-3, 6-2తో గోర్చెక్(మెసిడోనియా)పై, 13వ సీడ్ పోలిని 0-6, 6-4, 7-5తో మాంటోగోమరీ(అమెరికా)పై విజయం సాధించి రెండోరౌండ్‌కు చేరారు.









కామెంట్‌లు (0)